ఐపీఎల్ 2024లో భాగంగా.. గుజరాత్ టైటాన్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో కాసేపట్లో మ్యా్చ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే.. పంజాబ్ జట్టు ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుంది. గాయపడిన లియామ్ లివింగ్‌స్టోన్ స్థానంలో సికందర్ రజాకు అవకాశం దక్కింది. గుజరాత్ జట్టు కూడా ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుంది. డేవిడ్ మిల్లర్ స్థానంలో కేన్ విలియమ్సన్ కు అవకాశం వచ్చింది.
Avis Hospitals: కొత్త శాఖలతో సేవల విస్తరణ చేపట్టిన ఎవిస్ హాస్పిటల్స్..
ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో గుజరాత్ జట్టు ఐదో స్థానంలో ఉండగా.. పంజాబ్ జట్టు ఏడో స్థానంలో ఉంది. ఆతిథ్య గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్‌లో మూడో విజయంపై కన్నేసింది. మరోవైపు.. పంజాబ్ కింగ్స్ రెండో విజయంపై కన్నేసింది. హోంగ్రౌండ్ లో ఆడిన మ్యాచ్ తప్ప.. మిగిలిన రెండు మ్యాచ్ లు పంజాబ్ ఓడిపోయింది. గుజరాత్ టైటాన్స్ హోంగ్రౌండ్ పై ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అటువంటి పరిస్థితిలో పంజాబ్ కింగ్స్‌పై ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే ఆతిథ్య జట్టుకు ఇక్కడి పరిస్థితుల గురించి తెలుసు. పంజాబ్ కింగ్స్ మళ్లీ విన్నింగ్ ట్రాక్ లోకి రావాలంటే మిడిలార్డర్ మంచి ఇన్నింగ్స్ ఆడాలి. టాప్ ఆర్డర్ బాగానే ఆడుతున్న.. మిడిలార్డర్ రాణించలేకపోతున్నారు.
Perni Nani: బీజేపీలో టీడీపీ దొంగలు పడ్డారు.. పురంధేశ్వరిపై పేర్ని నాని ఫైర్
గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ ఎలెవన్:
వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభ్మాన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, విలియమ్సన్, విజయ్ శంకర్, ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, నల్కండే.
పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్:
శిఖర్ ధావన్ (కెప్టెన్), బెయిర్ స్టో, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), ప్రభ్ సిమ్రాన్, సామ్ కరన్, శశాంక్, సికందర్ రజా, హర్ ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్ష్ దీప్ సింగ్.
