Punjab Kings Scored 167 In 20 Overs Against DC: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో.. పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగలిగింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ సెంచరీతో చెలరేగడం కారణంగానే.. పంజాబ్ జట్టు అంత స్కోరు చేయగలిగింది. మిగిలిన బ్యాటర్లలో ఏ ఒక్కరూ నిలకడగా రాణించలేదు. వచ్చినవాళ్లు వచ్చినట్టుగానే పెవిలియన్ బాట పట్టారు. మధ్యలో సామ్ కర్రన్ ఒకడే అతనికి కాసేపు స్టాండ్ ఇచ్చాడు. అనంతరం అతడు కూడా కొద్దిసేపటికే ఔట్ అయ్యాడు. ఇలా వికెట్లు పడుతున్నా.. ప్రభ్‌సిమ్రన్ మాత్రం ఒత్తిడికి గురవ్వకుండా, చివరివరకూ ఒంటరి పోరాటం కొనసాగించాడు.
CM KCR : 21 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలు
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టు తరఫున ప్రభ్‌సిమ్రన్, శిఖర్ ధవన్ ఓపెనింగ్ చేశారు. ఇది పంజాబ్‌కు అత్యంత కీలకమైన మ్యాచ్ కాబట్టి.. ధవన్ ఈరోజు కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతాడని అంతా ఆశించారు. కానీ.. అతడు 7 పరుగులే చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత లివింగ్‌స్టన్ (4), జితేశ్ శర్మ (5) కూడా వెనువెంటనే పెవిలియన్ బాట పట్టారు. అప్పుడు బరిలోకి దిగిన సామ్ కర్రన్‌తో కలిసి.. ప్రభ్‌సిమ్రన్ తన జట్టు స్కోరుని ముందుకు నడిపించాడు. కర్రన్ నిదానంగా రాణించగా.. ప్రభ్‌సిమ్రన్ పరుగుల వర్షం కురిపించే బాధ్యతని తీసుకున్నాడు. వీళ్లిద్దరు కలిసి నాలుగో వికెట్‌కి 72 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. వీరి ఆటతీరు చూసి.. ఈ జోడీనే చివరివరకు కొనసాగుతుందని అందరూ భావించారు. కానీ.. 15వ ఓవర్‌లో కర్రన్ ప్రవీన్ దూబే బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.
PM Shahbaz Sharif: ఇమ్రాన్ ఉగ్రవాది కన్నా తక్కువ కాదు.. ఆందోళకారుల అరెస్ట్‌కు 72 గంటల డెడ్‌లైన్
తొలుత అర్థశతకం పూర్తయ్యేదాకా నిదానంగా ఆడిన ప్రభ్‌సిమ్రన్.. ఆ తర్వాతి నుంచి బాదుడు మొదలుపెట్టాడు. ఢిల్లీ బౌలర్లపై వీరవిహారం చేసి.. బౌండరీల మోత మోగించేశాడు. దీంతో అతడు 65 బంతుల్లోనే 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 103 పరుగులు చేశాడు. అయితే.. ఆ ఊపులోనే అతడు 19వ ఓవర్‌లో రెండో బంతికి ముకేశ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ప్రభ్‌సిమ్రన్ పుణ్యమా అని.. పంజాబ్ జట్టు 167 పరుగులు చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో ఇశాంత్ శర్మ రెండు వికెట్లు తీయగా.. అక్షర్, ప్రవీణ్, కుల్దీప్, ముకేశ్ తలా వికెట్ పడగొట్టారు.
