ఐపీఎల్ 2024లో భాగంగా.. చెన్నైతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ అలవోక విజయం సాధించింది. 17.5 ఓవర్లలోనే 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 163 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి చేధించింది. పంజాబ్ బ్యాటింగ్లో బెయిర్ స్టో (46), రిలీ రోస్సో (43) పరుగులతో రాణించారు. ప్రభ్ సిమ్రాన్ సింగ్ (13), శశాంక్ సింగ్ (25*), సామ్ కరన్ (26*) చివరి వరకు ఉండి విక్టరీని సాధించారు. చెన్నై బౌలింగ్లో శార్దూల్ ఠాకూర్, రిచర్డ్ గ్లీసన్, శివం దూబే తలో వికెట్ సంపాదించారు.
Read Also: Off Th Record : కూటమి పార్టీల మధ్య ఏదో జరుగుతోందా.? బీజేపీకి టీడీపీ భయపడుతోందా.?
అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. చెన్నై బ్యాటింగ్లో అజింక్యా రహానే (29) ఈ మ్యాచ్లో రాణించాడు. ఆ తర్వాత గైక్వాడ్ (62) పరుగులు చేశాడు. అత్యధికంగా గైక్వాడ్ రన్స్ చేశాడు. సిక్సర్ల దూబే డకౌట్తో నిరాశపరిచాడు. రవీంద్ర జడేజా (2) పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి వచ్చిన సమీర్ రిజ్వీ (21) పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. మొయిన్ అలీ (15), చివర్లో ధోనీ (14), డారిల్ మిచెల్ (1*) పరుగులు చేయడంతో 162 రన్స్ సాధించారు. పంజాబ్ బౌలింగ్లో హర్ ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్ ఇద్దరు స్పిన్నర్లు సీఎస్కేను రన్స్ చేయకుండా కట్టడి చేశారు. వీరిద్దరూ చెరో రెండు కీలక వికెట్లు సంపాదించారు. ఆ తర్వాత కగిసో రబాడ, అర్ష్దీప్ సింగ్ తలో వికెట్ తీశారు.
Read Also: KTR : ఏకంగా తెలంగాణ గొంతుక కేసీఆర్‌పైనే నిషేధమా..?
