Site icon NTV Telugu

Preity Zinta: ఎంఎస్ ధోనీ సిక్స్‌లు కొట్టలేదు.. పంజాబ్ గెలువలేదు: ప్రీతి జింతా

Preity Zinta

Preity Zinta

Preity Zinta on MS Dhoni: పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సిక్స్‌లు కొట్టాలని తాను కోరుకున్నానని బాలీవుడ్ నటి ప్రీతి జింతా తెలిపారు. ధోనీ సిక్స్‌లు కొట్టినా.. తమ జట్టు పంజాబ్ గెలవాలని కోరుకున్నానని చెప్పారు. ధోనీ సిక్స్‌లు కొట్టలేదని, పంజాబ్ మ్యాచ్ గెలువలేదని ప్రీతి నిరాశ చెందారు. ఆదివారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి తొలి బంతికే ఔటై పెవిలియన్‌కు చేరాడు.

పంజాబ్‌ కింగ్స్‌, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో ప్రీతి జింతా సందడి చేశారు. పంజాబ్ బౌలర్లు వికెట్స్ తీసినప్పుడు, బ్యాటర్లు రన్స్ బాదినపుడు సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఎంఎస్ ధోనీ ఔటైనపుడు మాత్రం అయ్యో అంటూ నిరాశ చెందారు. ఓమేశ్‌ క్రికెట్‌ హాలిక్‌ అనే ఎక్స్‌ హ్యాండిల్‌ ద్వారా ఓ అభిమాని.. ప్రీతి జింతాకు ఈ రోజు ఒక అభ్యర్థన చేశాడు. ‘ప్రీతి మేడమ్‌.. మేం ఎంఎస్‌ ధోనీని పంజాబ్‌ కింగ్స్‌ జట్టులో చూడాలని అనుకుంటున్నాం’ అంటూ ఓ ఎమోజీని పోస్ట్ చేశాడు. అంతేకాదు ఎరుపు, పసుపు లవ్‌ సింబల్స్‌ను జత చేశాడు. ప్లీజ్‌ చాట్‌ మేడమ్ అని కోరాడు.

Also Read: Asha Sobhana: భారత మహిళా క్రికెట్‌లో ఆశా శోభన సరికొత్త చరిత్ర!

అభిమానికి ప్రీతీ జింతా రిప్లై ఇచ్చారు. ‘ఎంఎస్ ధోనీని ఎవరు కాదంటారు. ప్రతి ఒక్కరూ ఆయనను కోరుకుంటారు. నాతో సహా ప్రతి ఒక్కరూ ఆయనకు అభిమానులే’ అని ప్రీతీ పేర్కొన్నారు. ‘మ్యాచ్‌లో పంజాబ్‌ జట్టు గెలవాలని, ధోనీ సిక్సర్‌లు కొట్టాలని నేను కోరుకున్నా. కానీ దురదృష్టవశాత్తు మా టీమ్‌ గెలువలేదు. ధోనీ సిక్స్‌లు కొట్టలేదు’ ప్రీతి చెప్పుకొచ్చారు. ప్రీతీ జింతా ఇచ్చిన ఈ రిప్లై నెటిజన్‌ల మనసు దోచుకుంది.

 

Exit mobile version