Preity Zinta-Shreyas Iyer: ఇది ఆటేనా అసలు.. శ్రేయస్ అయ్యర్‌పై ప్రీతి జింటా ఫైర్!
- మరింత క్లిష్టంగా పంజాబ్ కింగ్స్ పరిస్థితి
- వరుసగా ఆరో ఓటమిని చవిచూసిన పీబీకేఎస్
- శ్రేయస్ అయ్యర్‌తో ప్రీతి జింటా సీరియస్ డిస్కషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Preity Zinta In Serious Discussion With Shreyas Iyer: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఆదివారం ధర్మశాల వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన కీలక మ్యాచ్‌లో పంజాబ్ 23 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో పీబీకేఎస్ వరుసగా ఆరో ఓటమిని చవిచూసి.. ప్లేఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. మిగిలిన మ్యాచ్‌లో గెలిచినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఆర్ఆర్, సీఎస్కేలు తమ చివరి రెండు మ్యాచ్‌లలో గెలిస్తే.. పీబీకేఎస్ ఇంటికి వెళ్లాల్సిందే. ప్రస్తుతం సమీకరణాలు చూస్తే.. పంజాబ్ ప్లేఆఫ్స్ చేరడం కష్టమే.
మ్యాచ్ అనంతరం పంజాబ్ కింగ్స్ జట్టు సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటాకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మైదానంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో ప్రీతి జింటా సీరియస్‌గా మాట్లాడిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రీతి, శ్రేయాస్ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోపై నెటిజెన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ‘ఏం చేద్దాం శ్రేయస్ ఇప్పుడు’, ‘ఏం జరుగుతోంది సర్పంచ్ సాబ్’, ‘ఇక మనం ఇంటికేనా’ అంటూ జోకులు పేల్చుతున్నారు. మరోవైపు డ్రెస్సింగ్ రూమ్‌లో పంజాబ్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కూడా తీవ్ర నిరాశతో కనిపించాడు.
Also Read
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. వెంకటేశ్ అయ్యర్ అజేయంగా 73 పరుగులు చేసి చెలరేగగా.. విరాట్ కోహ్లీ 58 పరుగులతో రాణించాడు. లక్ష్య ఛేదనలో పంజాబ్ 199/8కే పరిమితమైంది. ఆర్సీబీ బౌలర్లు రసిఖ్ సలామ్ దార్ మూడు వికెట్లు పడగొట్టగా.. భువనేశ్వర్ కుమార్ రెండు కీలక వికెట్లు తీశాడు. మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ మాట్లాడుతూ ఓటమికి పవర్‌ప్లేనే ప్రధాన కారణమని అంగీకరించాడు. ‘ఆర్సీబీ పవర్‌ప్లేలోనే మంచి ఆరంభం చేసింది. 222 పరుగులు చేయడం గొప్ప విషయం. మేము మాత్రం వికెట్లు తీయలేకపోయాం. మ్యాచ్ పవర్‌ప్లేలోనే చేజారిపోయింది’ అని అయ్యర్ తెలిపాడు.
లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం జట్టును దెబ్బతీసిందని శ్రేయస్ పేర్కొన్నాడు. ‘ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య ఈ సీజన్లో మాకు అద్భుతమైన ఆరంభాలు ఇచ్చారు. కానీ ఈ మ్యాచ్‌లో త్వరగా అవుట్ అయ్యారు. నేను కూడా త్వరగా ఔటయ్యాను. ఇది నిరాశ కలిగించే విషయం. అయినప్పటికీ శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్ బాగా పోరాడారు’ అని చెప్పాడు. పంజాబ్ ఇన్నింగ్స్‌లో శశాంక్ సింగ్ 27 బంతుల్లో 56 పరుగులతో చివరి వరకు పోరాడాడు. స్టోయినిస్ 37 పరుగులు చేశాడు. అయితే అవసరమైన రన్‌రేట్ పెరిగిపోవడంతో పంజాబ్ లక్ష్యాన్ని అందుకోలేకపోయింది.
🚨PREITY ZINTA IS NOT HAPPY WITH SHREYAS IYER’S CAPTAINCY 🚨
🔸Preity Zinta is having a serious chat with skipper Shreyas Iyer after the team’s sixth consecutive loss! 🗣️
🔸Shreyas Never performs for Punjab after early wickets fall
🔸 He always concedes 200–250+ runs as a… pic.twitter.com/23QoOcnSq5— Indian Cricket (@IPL2025Auction) May 17, 2026
Seeing Preity Zinta man and Shreyas this sad really hurts 🥺😭💔
— Shreyass Eraa (@IyerShreyass) May 17, 2026
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!