Rohit Sharma: ఆ రోజు చాలా భయపడ్డాను: రోహిత్‌ శర్మ

Rohit Sharma Mi

Rohit Sharma Mi

Mumbai Indians Batter Rohit Sharma React on Fan approached him in IPL 2024: ఇటీవల ముంబై ఇండియన్స్‌ స్టార్‌ బ్యాటర్ రోహిత్‌ శర్మకు ఓ అభిమాని షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌ 2024లో భాగంగా ఏప్రిల్‌ 1న వాంఖడే వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న‌ రోహిత్‌ను గ్రౌండ్‌లో దూసుకొచ్చిన ఓ అభిమాని వెనక్కి నుంచి హత్తుకునే ప్రయత్నం చేశాడు. అభిమాని హఠాత్తుగా రావడం చూసిన రోహిత్.. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. భ‌యంతో దూరం వెళ్లేందుకు ప్ర‌య‌త్నించాడు. ఆ తర్వాత అతడికి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చాడు. ఆపై సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఆ అభిమానిని మైదానం నుంచి బయటకు పంపించారు.

ఆ సంఘటనపై రోహిత్‌ శర్మ తాజాగా స్పందించాడు. క్లబ్ ప్రైరీ పోడ్‌కాస్ట్‌లో ఆ రోజు జరిగిన సంఘటన గురించి హిట్‌మ్యాన్ వివరించాడు. ‘ఆ అభిమాని నా దగ్గరకు వచ్చి నేను మీకు మీకు పెద్ద ఫ్యాన్‌ను అని, ఓ హాగ్‌ కావాలని అడిగాడు. నేను అతడికి హాగ్ ఇచ్చాను. చాలా సంతోషపడ్డాడు. అయితే అభిమానులు మ్యాచ్‌ జరుగుతుండగా మైదానంలోకి రాకూడదు. సెక్యూరిటీ కళ్లు గప్పి వస్తే.. మీరే చిక్కుల్లో పడతారు. దయచేసి ఇంకోసారి ఎలా అస్సలు చేయవద్దు’ అని రోహిత్ కోరాడు.

×
×
Ad

Also Read: Rohit Sharma: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ!

‘నిజానికి నేను స్లిప్‌లో ఉండి ఫీల్డ్‌ సెట్‌ చేస్తున్నా. ఆ అభిమాని మైదానంలోకి రావడాన్ని నేను గమనించలేదు. మిడ్-ఆఫ్‌లో నాకు ఎదురుగా ఉన్న టిమ్ డేవిడ్.. ఓ వ్యక్తి వస్తున్నాడని సైగలు చేశాడు. అయితే డేవిడ్ ఏమి చెప్పాలనుకుంటున్నాడో నాకు అర్థం కాలేదు. అదే సమయంలో ఆ అభిమాని నా పక్కన వచ్చి నిలబడ్డాడు. అతడిని చూసి నేను ఒక్కసారిగా భయపడ్డా. అభిమానిని అని చెప్పడంతో మ్నా మనసు కాస్త కుదుటపడింది’ రోహిత్‌ శర్మ చెప్పాడు.