Mumbai Indians Coach Mark Boucher on Rohit Sharma’s IPL Future: ఐపీఎల్ 2024లో భాగంగా శుక్రవారం రాత్రి వాంఖడే స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 18 పరుగుల తేడాతో ఓడింది. దాంతో ముంబై టీమ్ ఓటమితో ఈ సీజన్‌ను ముగించింది. ఐపీఎల్ 2024లో 14 మ్యాచ్‌లు ఆడిన ముంబై .. నాలుగు విజయాలు, పది ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఐపీఎల్ 2024 మే 26 వరకు జరగనుండగా.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ముంబై ప్లేయర్స్ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోనున్నారు.
లక్నోతో మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మను ఆ జట్టు హెడ్ కోచ్ మార్క్ బౌచర్ కలిశాడట. ఐపీఎల్ ముగిసింది కదా?, తర్వాత ఏంటి? అని హిట్‌మ్యాన్‌ను అడిగితే.. రోహిత్ నుంచి ఊహించని సమాధానం వచ్చిందట. ఐపీఎల్ ముగిస్తే.. టీ20 ప్రపంచకప్ 2024 ఉంది కదా? అని హిట్‌మ్యాన్ చెప్పాడట. కొన్ని రోజులైనా విశ్రాంతి తీసుకోకుండా.. పొట్టి కప్ కోసం ప్రాక్టీస్ చేయాలని సమాధానం చెప్పిన రోహిత్‌ను చూసి బౌచర్ షాక్ అయ్యాడట. ఈ విషయాన్ని బౌచర్ స్వయంగా అభిమానులతో పంచుకున్నాడు.
Also Read: Chandrakanth-Shilpa Marriage Video: త్రినయని సీరియల్ నటుడు చంద్రకాంత్ పెళ్లి వీడియో!
మార్క్ బౌచర్ మీడియాతో మాట్లాడుతూ… ‘వ్యక్తిగతంగా నాకు రోహిత్ శర్మ అంటే చాలా ఇష్టం. నేను అతడితో మాట్లాడాను. రోహిత్ భవిష్యత్తు గురించి మా మధ్య పెద్దగా సంభాషణలు జరగలేదు. కేవలం ఈ సీజన్ గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. హిట్‌మ్యాన్ ఏం చేయాలనుకుంటే దానినే ఆచరిస్తాడు. ఐపీఎల్ 2024లోనూ రోహిత్ అద్భుతంగా ఆడాడు. చెన్నైపై సెంచరీ చేశాడు. ఆరంభంలోనే దూకుడుగా పరుగులు రాబట్టాడు. లక్నోపై కూడా ఆడిన ఇన్నింగ్స్‌ను మనం చూశాం. ఇక తర్వాత ఏంటి? అని అతడిని అడిగా. మామూలుగా చాలా మంది విశ్రాంతి గురించో లేదా ఇతర పనుల గురించి చెబుతారు. కానీ రోహిత్ మాత్రం ప్రపంచకప్ ఉందిగా అన్నాడు. ఆటపట్ల అతడికి ఉన్న కమిట్‌మెంట్ ఏ స్థాయిలో ఉందో అర్ధమైంది. వచ్చే సీజన్‌లో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేం . ఐపీఎల్ 2025 కోసం మెగా ఆక్షన్ జరగనుంది’ అని తెలిపాడు.