Site icon NTV Telugu

MS Dhoni: ధోని ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. ఐపీఎల్లో ఆడటంపై క్లారిటీ

Dhoni

Dhoni

MS Dhoni: టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ పై గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి తెర పడింది. రాబోయే ఐపీఎల్ సీజన్ లో ధోనీ ఆడటంపై ఆ జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్ క్లారిటీ ఇచ్చారు. ధోనీ మాతో మాట్లాడారు.. ఆయన వచ్చే సీజన్‌కి అందుబాటులో ఉంటారని తెలిపారు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి ధోనీ చెన్నై సూపర్ కింగ్స్‌కు వెన్నెముకలాంటివాడు.. ఆయన నాయకత్వంలో సీఎస్‌కే ఐదు సార్లు టైటిల్ సాధించి రికార్డు సృష్టించింది అన్నారు. ఇక, 2025 ఐపీఎల్ సీజన్‌లో సీఎస్‌కె జట్టు పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో నిలిచింది.

Read Also: Chiranjeevi : పవన్ కల్యాణ్ ను ఆ కారణంతోనే అందరూ ఇష్టపడతారు.. చిరు ఎమోషనల్

అయితే, నవంబర్ 15వ తేదీన జరగనున్న రిటెన్షన్ కార్యక్రమానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మేనేజ్‌మెంట్‌ తో పాటు ఎంఎస్ ధోనీ, టీమ్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సమావేశం కానున్నారు. కాగా, ఐపీఎల్ ప్రారంభమైన 19 సీజన్లలో మహేంద్ర సింగ్ ధోని చెన్నై తరఫున 17 సీజన్‌లు ఆడాడు. ఇప్పటి వరకు సీఎస్‌కే తరఫున 248 మ్యాచ్‌లు ఆడిన ధోనీ, 4,865 పరుగులు చేశాడు. ఆయన కెప్టెన్సీలో చెన్నై జట్టు 2010, 2011, 2018, 2021, 2023లో ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. తాజా సీజన్‌లో కూడా అభిమానులు “తల” ధోనీని మళ్లీ ఆ యెల్లో జెర్సీలో చూసే అవకాశం దక్కబోతుంది.

Exit mobile version