NTV Telugu Site icon

MS Dhoni: సీఎస్కే ఫ్యాన్స్కు గుడ్‌న్యూస్‌.. పుకార్లకు చెక్ పెట్టిన ఎంఎస్ ధోనీ

Dhoni

Dhoni

MS Dhoni: ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు మెగా వేలం జరగబోతుంది. ఆలోపు రిటెన్షన్, రైట్‌ టు మ్యాచ్‌తో ఆటగాళ్లను ఫ్రాంచైజీలు తమ దగ్గర అట్టిపెట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి గడువు అక్టోబర్ 31 వరకు మాత్రమే ఉండగా.. ఇప్పటి వరకు ఏ ఫ్రాంచైజీ కూడా అధికారికంగా ప్లేయర్ల జాబితాలను రిలీజ్ చేయలేదు. అయితే, ఒక్క ప్లేయర్‌ విషయంలోనే అభిమానుల్లో తీవ్ర స్థాయిలో టెన్షన్ నెలకొంది. అతడు ఈసారి ఐపీఎల్‌లో ఆడతాడా? లేదా? అనేది ప్రశ్న ఫ్యాన్స్ లో మెదులుతుంది. కానీ, తాజాగా మహేంద్ర సింగ్ ధోనీ ఓ కార్యక్రమంలో మాట్లాడిన మాటలు ఐపీఎల్‌లో పాల్గొనడంపై వస్తోన్న పుకార్లకు చెక్‌ పెట్టినట్లైంది. మరి కొన్నేళ్లు క్రికెట్ ఆడేందుకు తాను రెడీగా ఉన్నట్లు తెలిపాడు. అంతేకాదు, మరో మూడేళ్ల వరకు అతడిని మైదానంలో చూసే ఛాన్స్ ఉంది. రిటైన్‌ చేసుకొనే ఆటగాళ్లను కనీసం మూడేళ్ల పాటు ఆడించేందుకు ఛాన్స్ ఉంటుంది.

Read Also: Spiritual Pilgrimage Bus Tour: ఒకేరోజులో పంచారామ క్షేత్రాల సందర్శన.. అధ్యాత్మిక యాత్రకు మంత్రి దుర్గేష్‌ శ్రీకారం..

ఇక, గోవాలో జరిగిన ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్న టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను క్రికెట్‌ను ఆస్వాదిస్తూ ఆడితే జట్టుకు, వ్యక్తిగతంగాను ప్రయోజనం ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. ఇకపై నేను ఆడబోయే క్రికెట్‌ను మరింత ఆస్వాదించాలని కోరుకుంటున్నాను.. ప్రొఫెషనల్‌ గేమ్‌ ఆడేవాళ్లు ఎప్పుడు ఎంజాయ్‌ చేయలేరు.. కానీ, నేను మాత్రం అలా ఉండకూడదని అనుకుంటున్నాను.. కానీ, ఇది చాలా కష్టమైనది.. కమిట్‌మెంట్స్, భావోద్వేగాలు చాలా ఉంటాయి.. వీటన్నింటినీ పక్కన పెట్టేసి రాబోయే కొన్నేళ్లు ఆటను మరింతగా ఆస్వాదిస్తాను అని చెప్పారు. అందుకోసం గత తొమ్మిది నెలలుగా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాను.. ఐపీఎల్‌లో కేవలం రెండున్నర నెలలు మాత్రమే క్రికెట్ ఆడతా.. అందుకోసం పక్కాగా ప్రణాళిక చేసుకోవాలి.. అదే సమయంలో వ్యక్తిగతంగానూ జీవితాన్ని గడపాలని టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ వెల్లడించాడు.

Read Also: Couple Stuck In Lift: తిరుపతి రైల్వే స్టేషన్‌లో లిఫ్ట్‌లో ఇరుక్కున్న దంపతులు.. ఊపిరాడక ఇబ్బంది

ఇక, CSK ధోనిని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా తీసుకునే అవకాశం ఉంది. రూ.4 కోట్లకు అతడిని దక్కించుకునే అవకాశం ఉంది. గత సీజన్‌లో కెప్టెన్సీని వదిలిపెట్టిన ఎంఎస్ ధోనీ జట్టును నడిపించే బాధ్యతను యువ క్రికెటర్ రూతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాడు. కాగా, గైక్వాడ్ కెప్టెన్సీలో సీఎస్‌కే జట్టు ప్లేఆఫ్‌కు చేరుకోలేకపోయింది. ఇక, గత సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన ఎంఎస్ ధోనీ 224.48 స్ట్రైక్ రేట్‌తో 110 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2024లో అతను 37 పరుగులతో అజేయంగా నిలిచాడు.