NTV Telugu Site icon

MI vs RCB: నువ్ తోపు అన్న.. జస్ప్రీత్ బుమ్రాకు శిరస్సు వంచి సలాం కొట్టిన మహమ్మద్ సిరాజ్‌!

Siraj Bows Down To Bumrah

Siraj Bows Down To Bumrah

Mohammed Siraj Hugs Jasprit Bumrah after 5 Wicket Haul in MI vs RCB: ఐపీఎల్‌ 2024లో భాగంగా గురువారం వాంఖడేలో మైదానంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగాడు. సహచర, ప్రత్యర్థి బౌలర్లు తేలిపోయిన వాంఖడే పిచ్‌పై బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఒక్కో బౌలర్ 40, 50 పరుగులు సమర్పించుకుంటే.. బుమ్రా మాత్రం తన నాలుగు ఓవర్ల కోటాలో 21 రన్స్ ఇచ్చి ఏకంగా 5 వికెట్స్ పడగొట్టాడు. బుమ్రా బౌలింగ్‌కు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యరు. సోషల్ మీడియాలో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌కు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పేసర్, టీమిండియా బౌలర్ మహమ్మద్ సిరాజ్‌ మంత్ర ముగ్దుడయ్యాడు. నువ్ తోపు అన్న అన్నట్లుగా బుమ్రాకు శిరస్సు వంచి సలాం కొట్టాడు. మ్యాచ్ అనంతరం బుమ్రా మైదానంలోకి రాగా.. సిరాజ్ దగ్గరకు వచ్చి శిరస్సు వంచి సలాం కొట్టాడు. ఆపై ఇద్దరు కౌగిలించుకున్నారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లు వేసి 37 పరుగులు ఇచ్చాడు.

Also Read: Jasprit Bumrah: కెనడా క్రికెట్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనుకున్నా: జస్ప్రీత్ బుమ్రా

ఈ మ్యాచ్‌లో బెంగళూరు పై ముంబై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. డుప్లెసిస్‌ (61), రజత్‌ పాటిదార్‌ (50), దినేశ్‌ కార్తీక్‌ (53 నాటౌట్‌) హాఫ్ సెంచరీలు చేశారు. బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగాడు. 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై 15.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇషాన్‌ కిషన్‌ (69), సూర్యకుమార్‌ యాదవ్‌ (52) విధ్వంసం సృష్టించారు.

Show comments