Rohit Sharma: ముంబై ఇండియన్స్ ఓటమికి కారణం రోహిత్.. ఇంతకీ ఏం జరిగిందంటే?
- బెంగళూరుపై ముంబై 18 పరుగుల తేడాతో ఓటమి
- ముంబై ఓటమికి కారణం రోహిత్
- రోహిత్ నిష్క్రమణతో గతి తప్పిన ముంబై ఇన్నింగ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదివారం జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శన చేసింది. ముంబై ఇండియన్స్‌పై 18 పరుగుల తేడాతో విజయం సాధించి సత్తా చాటింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ముంబై 222 పరుగులకే పరిమితమై ఓటమిని చవిచూసింది. బెంగళూరు బ్యాటర్లు ఆరంభం నుంచే ముంబై బౌలర్లపై విరుచుకుపడింది. ఫిల్ సాల్ట్ (78 పరుగులు; 36 బంతుల్లో) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రజత్ పాటీదార్ (53 పరుగులు; 20 బంతుల్లో) మెరుపు అర్ధ శతకం చేయగా.. విరాట్ కోహ్లీ (50 పరుగులు; 38 బంతుల్లో) రాణించడంతో ఆర్సీబీ భారీ స్కోరును నమోదు చేసింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు ఓపెనర్ రికెల్టన్ (37 పరుగులు; 22 బంతుల్లో) మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే జట్టు స్కోరు 57 పరుగుల వద్ద ఉన్నప్పుడు అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఓపెనర్ రోహిత్ శర్మ (19 పరుగులు; 13 బంతుల్లో) తొడ కండరాల గాయం కారణంగా ‘రిటైర్డ్ హర్ట్’గా మైదానాన్ని వీడాల్సి వచ్చింది. రోహిత్ నిష్క్రమణతో ముంబై ఇన్నింగ్స్ ఒక్కసారిగా తడబడింది. ఆ వెంటనే సుయాశ్ శర్మ వేసిన ఒకే ఓవర్లో రికెల్టన్, తిలక్ వర్మ (1) అవుట్ కావడంతో ముంబై కష్టాల్లో పడింది.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read: Hardik Pandya: ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది.. ముంబై ఓటములపై హార్దిక్ ఆసక్తికర వ్యాఖ్యలు!
మధ్యలో సూర్యకుమార్ యాదవ్ (33 పరుగులు; 22 బంతుల్లో), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (40 పరుగులు; 22 బంతుల్లో ) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే రన్ రేట్ అంతకంతకు పెరిగిపోవడంతో ధాటిగా ఆడే క్రమంలో ఇద్దరు పెవిలియన్ చేరారు. నమన్ ధీర్ (1) కూడా త్వరగానే అవుట్ అయ్యాడు. ఆఖర్లో రూథర్‌ఫర్డ్ (71 నాటౌట్; 31 బంతుల్లో) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రూథర్‌ఫర్డ్ పోరాటం కేవలం ఓటమి అంతరాన్ని తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడింది. రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్ కారణంగానే ముంబై ఓడిపోయిందని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Cyber Fraud: తెలుగు అమ్మాయిలతో సైబర్ వల.. ఢిల్లీ ముఠా దందా బట్టబయలు
-
Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
-
Ranabaali: రణబాలి రిలీజ్‌పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
-
JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
-
Akhil Akkineni: అఖిల్-సాదినేని నిజం కాదట!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!