Ruturaj Gaikwad IPL Record: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అరుదైన ఘనత సాధించాడు.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత వేగంగా 2 వేల పరుగులు పూర్తి చేసిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ (69) చేసిన రుతురాజ్.. ఈ అరుదైన ఫీట్‌ను అందుకున్నాడు. 57 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనతను అందుకున్నాడు. ఇప్పటివరకు 58 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన రుతురాజ్.. 2021 పరుగులు చేశాడు.
Also Read: MS Dhoni Sixes: ఎంఎస్ ధోనీ హ్యాట్రిక్ సిక్స్‌లు.. దద్దరిల్లిన వాంఖడే స్టేడియం! వీడియో వైరల్
ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 2 వేల పరుగులు పూర్తి చేసిన ఘనతను టీమిండియా స్టార్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కూడా అందుకోలేదు. కేఎల్ రాహుల్ (60 ఇన్నింగ్స్‌లు) ఇప్పటివరకు భారత్ తరఫున ఈ జాబితాలో టాప్ బ్యాటర్. ఐపీఎల్‌లో వేగంగా రెండు వేల పరుగులు చేసిన రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ 48 ఇన్నింగ్స్‌లలోనే రెండు వేల పరుగులు చేశాడు. షాన్ మార్ష్ (52 ఇన్నింగ్స్‌లు) తర్వాతి స్థానంలో ఉన్నాడు.
ఇక చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రెండు వేలు అంతకంటే ఎక్కువ చేసిన నాలుగో బ్యాటర్‌గా రుతురాజ్ గైక్వాడ్ నిలిచాడు. రుతురాజ్‌కు ముందు ఫాఫ్ డుప్లెసిస్ (92 మ్యాచుల్లో 2,721 పరుగులు), ఎంఎస్ ధోనీ (226 మ్యాచుల్లో 4,547 ), సురేశ్ రైనా (176 మ్యాచుల్లో 4,687) ఉన్నారు. ప్రస్తుతం రుతురాజ్ 2021 పరుగులు పూర్తిచేశాడు. సీఎస్‌కే తరఫున 2020లో అరంగేట్రం చేశాడు.