MS Dhoni Sixes: ఎంఎస్ ధోనీ హ్యాట్రిక్ సిక్స్‌లు.. దద్దరిల్లిన వాంఖడే స్టేడియం! వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni Hat-Trick Sixes Video Goes Viral: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అదరగొడుతున్నాడు. తనదైన షాట్లతో మునుపటి ధోనీని గుర్తుచేస్తున్నాడు. ధనాధన్ షాట్లతో మైదానంలోని ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇటీవల విశాఖలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ.. 16 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌పై మహీ మరోసారి చెలరేగాడు.
ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ చివరి ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చి హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు. 20వ ఓవర్లోని 3, 4, 5 బంతులకు భారీ సిక్సర్లు కొట్టాడు. ధోనీ సిక్స్‌లతో స్టేడియం దద్దరిల్లింది. చెన్నై సూపర్ కింగ్స్ ఫాన్స్ మాత్రమే కాదు.. ముంబై ఫాన్స్ కూడా ఎంజాయ్ చేశారు. బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ కూడా మహీ భారీ సిక్సర్లను ఎంజాయ్ చేశారు. ధోనీ హ్యాట్రిక్ సిక్స్‌లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: Hardik Pandya: స్టంప్స్ వెనుక మాస్టర్ మైండ్ ఉంది: హార్దిక్
ఎంఎస్ ధోనీ కేవలం 4 బంతుల్లోనే 3 సిక్సర్ల సాయంతో 20 పరుగులు చేశాడు. దాంతో చెన్నై సూపర్ కింగ్స్ స్కోర్ 200 పరుగులు దాటింది. మహీ ఆడిన ఇన్నింగ్సే ముంబై ఇండియన్స్ కొంపముంచింది. సరిగ్గా ధోనీ చేసిన ఆ 20 పరుగులే ముంబై ఓటమికి కారణమయ్యాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులకే పరిమితమైంది.
Mahi🤌🏻💗
Thankyou for ur existence💛#DHONI𓃵pic.twitter.com/KHO6UbzplO— Akku🕉️ (@Tiny_____heart) April 15, 2024
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!