NTV Telugu Site icon

LSG vs MI: లక్నోకు గుడ్‌న్యూస్‌.. ముంబైకి దబిడిదిబిడే!

Lucknow Super Giants

Lucknow Super Giants

Lucknow Pacer Mayank Yadav Likely To Play against Mumbai: ఐపీఎల్ 2024 భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య నేడు మ్యాచ్ జరగనుంది. భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. మరీ ముఖ్యంగా ఈ మ్యాచ్ ముంబైకి చాలా కీలకం. ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే.. ఈ మ్యాచ్‌లో హార్దిక్ సేన గెలవాల్సిందే. లక్నో కూడా ఇది కీలకమైన మ్యాచే. కీలక మ్యాచ్ ముందు లక్నోకు ఓ గుడ్‌న్యూస్. గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్‌లకు దూరమైన ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ ఫిట్‌నెస్ సాధించాడు.

మయాంక్ యాదవ్ ఫిట్‌నెస్ సాధించిన విషయాన్ని లక్నో సూపర్‌ జెయింట్స్‌ బౌలింగ్‌ కోచ్‌ మోర్నీ మోర్కల్ ధ్రువీకరించాడు. మంగళవారం (ఏప్రిల్ 30) ముంబై ఇండియన్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో మయాంక్ ఆడే అవకాశం ఉందని తెలిపాడు. ‘మాయాంక్ యాదవ్‌ ప్రస్తుతం ఫిట్‌గా ఉన్నాడు. అన్ని ఫిట్‌నెస్ టెస్టులు అతడు పాసయ్యాడు. ఇది మాకు గుడ్‌న్యూస్. ముంబైతో జరిగే కీలక మ్యాచ్‌లో అతడు ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగే అవకాశముంది’ అని మోర్కల్ తెలిపాడు. మయాంక్ బరిలోకి దిగితే.. ముంబైకి దబిడిదిబిడే అనే చెప్పాలి. ఎందుకంటే బుల్లెట్ బంతులతో అతడు ఆకట్టుకుంటున్నాడు.

Also Read: Sunil Narine: టీమ్‌ మీటింగ్‌లకు సునీల్ నరైన్ రాడు: శ్రేయస్ అయ్యర్

ఐపీఎల్ 2024లో మయాంక్‌ యాదవ్ సంచలన వేగంతో ఆకట్టుకున్నాడు. నిలకడగా 150కి పైగా కిమీ వేగంతో బంతులేస్తున్నాడు. మయాంక్‌ బంతులకు స్టార్‌ క్రికెటర్లు సైతం షాక్ అవుతున్నారు. ఈ ఎడిషన్‌లో బెంగళూరుపై 156.7 కిమీ వేగంతో బంతిని విసిరాడు. 2024 సీజన్‌లో ఇదే అత్యంత వేగవంతమైన బంతి. పంజాబ్‌పై 155.8 కిమీ స్పీడ్‌తో బంతిని సంధించాడు. అయితే ఏప్రిల్ 7న గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక్క ఓవర్‌ మాత్రమే వేసి.. గాయం కారణంగా మైదానాన్ని వీడాడు. ఇపుడు మయాంక్ ఫిట్‌నెస్ సాధించాడు.

Show comments