ఐపీఎల్ 2024లో భాగంగా.. లక్నోతో జరిగినన మ్యాచ్ లో కోల్కతా ఘన విజయం విజయం సాధించింది. 162 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 26 బంతుల్లో ఉండగానే ముగించింది. కేవలం రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ ఫిల్ సాల్ట్ (89) పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతని ఇన్నింగ్స్ లో 3 సిక్స్ లు, 14 ఫోర్లు ఉన్నాయి. అటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (38) కూడా చెలరేగాడు. కేకేఆర్ బ్యాటింగ్ లో సునీల్ నరైన్ (6), రఘువంశీ (7) పరుగులు చేశారు. హోంగ్రౌండ్ లో కేకేఆర్ విజయంతో ముగించారు. లక్నో బౌలింగ్ లో కేవలం మోసిన్ ఖాన్ మాత్రమే రెండు వికెట్లు పడగొట్టాడు. మిగతా బౌలర్లు వికెట్లు తీయడంలో విఫలమయ్యారు.
Balakrishna: రాబోయే ఎన్నికల్లో గెలుపు మనదే.. వైసీపీపై తీవ్ర విమర్శనాస్త్రాలు
అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. లక్నో బ్యాటింగ్లో నికోలస్ పూరన్ అత్యధికంగా (45) పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 4 సిక్స్లు, 2 ఫోర్లు ఉన్నాయి. ఆ తర్వాత కెప్టెన్ కేఎల్ రాహుల్ (39) పరుగులు చేశాడు. లక్నో బ్యాటింగ్లో క్వింటాన్ డికాక్ (10), దీపక్ హుడా (8), ఆయుష్ బదోని (29), స్టోయినీస్ (10), కృనాల్ పాండ్యా (7), అర్షద్ ఖాన్ (5) పరుగులు చేశారు. కోల్కతా బౌలర్లు లక్నో బ్యాటర్లను కట్టడి చేయడంతో.. ఓ మోస్తరు స్కోరు మాత్రమే చేయగలిగింది. కేకేఆర్ బౌలింగ్లో.. మిచెల్ స్టార్క్ 3 వికెట్లతో చెలరేగాడు. ఆడిన ఐదు మ్యాచ్ల్లో ఈ మ్యాచ్లోనే.. మొదటిసారి వికెట్లు తీశాడు. ఆ తర్వాత వైభవ్ అరోరా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ఆండ్రూ రస్సెల్ తలో వికెట్ సంపాదించారు.
PM Modi: రాహుల్ గాంధీ ‘‘రాజ మాంత్రికుడు’’.. పేదరికం వ్యాఖ్యలపై పీఎం మోడీ ఫైర్..
