NTV Telugu Site icon

LSG vs KKR: కోల్కతా ముందు మోస్తరు లక్ష్యం.. ఎంత స్కోరు చేశారంటే..?

Kkr

Kkr

ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు కోల్కతా నైట్ రైడర్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో.. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో.. కోల్కతా ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. లక్నో బ్యాటింగ్లో నికోలస్ పూరన్ అత్యధికంగా (45) పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 4 సిక్స్లు, 2 ఫోర్లు ఉన్నాయి. ఆ తర్వాత కెప్టెన్ కేఎల్ రాహుల్ (39) పరుగులు చేశాడు.

IPL 2024: రమణదీప్ సింగ్ ‘స్టన్నింగ్ క్యాచ్’.. షారూక్ ఖాన్ చప్పట్లతో ప్రశంసలు

లక్నో బ్యాటింగ్లో క్వింటాన్ డికాక్ (10), దీపక్ హుడా (8), ఆయుష్ బదోని (29), స్టోయినీస్ (10), కృనాల్ పాండ్యా (7), అర్షద్ ఖాన్ (5) పరుగులు చేశారు. కోల్కతా బౌలర్లు లక్నో బ్యాటర్లను కట్టడి చేయడంతో.. ఓ మోస్తరు స్కోరు మాత్రమే చేయగలిగింది. కేకేఆర్ బౌలింగ్లో.. మిచెల్ స్టార్క్ 3 వికెట్లతో చెలరేగాడు. ఆడిన ఐదు మ్యాచ్ల్లో ఈ మ్యాచ్లో.. మొదటిసారి 3 వికెట్లు తీశాడు. ఆ తర్వాత వైభవ్ అరోరా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ఆండ్రూ రస్సెల్ తలో వికెట్ సంపాదించారు.

Iran Israel War: దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన భారత ఎంబసీ.. హెల్ప్‌లైన్ నంబర్లు అంటూ..!

Show comments