KL Rahul Trolls: రాహుల్.. ఎక్కడ ఆ దూకుడు, వికెట్ కీపింగ్! ఇక జట్టులో చోటు కష్టమే
- స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న రాహుల్
- 23 బంతుల్లో 37 పరుగులు మాత్రమే
- కీపింగ్‌లో కూడా తేలిపోతున్న రాహుల్
- రాహుల్ ప్రదర్శనపై ఫాన్స్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KL Rahul Trolls for Slow Batting and Poor Wicketkeeping: ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న లోకేష్ రాహుల్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు. గతంలో ఐపీఎల్‌లో అద్భుతమైన రికార్డులు కలిగిన ఈ స్టార్ బ్యాటర్.. ఈ సీజన్‌లో మాత్రం తీవ్రంగా నిరాశపర్చుతున్నాడు. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో అభిమానులను నిరాశపరిచాడు. 200కి పైగా లక్ష్యాన్ని చేధించే సమయంలో రాహుల్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. తక్కువ పరుగులకే పెవిలియన్ చేరిన రాహుల్ బ్యాటింగ్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 243 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించాల్సి వచ్చింది. కేఎల్ రాహుల్ 23 బంతుల్లో 37 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. 160 స్ట్రైక్‌రేట్ ఉన్నప్పటికీ.. రాహుల్ ఇన్నింగ్స్ ఏమాత్రం ప్రభావం చూపలేదు. నితీష్ రానా దూకుడుగా ఆడుతుంటే.. రాహుల్ మాత్రం స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఉన్నాడు. ఓపెనర్‌గా మరింత దూకుడుగా ఆడాల్సిన సమయంలో స్లో ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు కీపింగ్‌లో కూడా తేలిపోయాడు. కీలక సమయంలో అభిషేక్ శర్మను రన్ అవుట్ చేసే అవకాశం చేజార్చాడు. 48 పరుగుల వద్ద లైఫ్ దక్కిన అభిషేక్.. ఆ తరువాత భారీ శతకం సాధించాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
లోకేష్ రాహుల్ అటు బ్యాటింగ్, ఇటు కీపింగ్‌లో తేలిపోవడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. ఫాన్స్ అతడిపై ఫైర్ అవుతున్నారు. ‘రాహుల్.. ఎక్కడ ఆ బ్యాటింగ్ దూకుడు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘ఇది వికెట్ కీపింగా’ అంటూ మండిపడుతున్నారు. ‘రాహుల్ స్లో వికెట్ కీపర్’ అంటూ నెటిజెన్స్ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇలా అయితే భారత జట్టులో చోటు కష్టమే అని హెచ్చరిస్తున్నారు. మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కూడా రాహుల్ ఇన్నింగ్స్‌పై సందేహాలు వ్యక్తం చేస్తూ.. 240కి పైగా లక్ష్యాన్ని చేధించే సమయంలో పవర్‌ప్లేను సద్వినియోగం చేసుకోకపోతే గెలవడం కష్టమని పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
-
Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్‌ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?