KL Rahul: లక్నో కెప్టెన్‌గా తప్పుకుంటున్న కేఎల్ రాహుల్.. 2025లో రిటైన్ కూడా కష్టమే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KL Rahul to quit Lucknow Super Giants: ఉప్పల్ మైదానంలో బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. లక్నో నిర్ధేశించిన 166 పరుగుల టార్గెట్‌ను ఎస్ఆర్‌హెచ్ కేవలం 9.4 ఓవర్లలోనే చేధించింది. సొంత మైదానంలో సన్‌రైజర్స్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు లక్నో బౌలర్లను ఊచకోత కోశారు. ఈ ఇద్దరి వీరబాదుడుకు ఎస్ఆర్‌హెచ్ ఈజీగా విజయాన్ని అందుకుంది. ఘోర ఓటమితో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ నిరుత్సాహానికి గురయ్యాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత తనకు మాటలు రావడం లేదని పేర్కొన్నాడు.
ఘోర ఓటమి తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై మండిపడ్డాడు. ఇందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ గురించి ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఐపీఎల్ 2024లో లక్నో ఆడే చివరి రెండు మ్యాచులకు రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించకపోవచ్చని తెలుస్తోంది. ‘లక్నో తదుపరి మ్యాచ్‌ను మే 14న ఢిల్లీతో ఆడనుంది. బ్యాటింగ్‌పై దృష్టి పెట్టడం కోసం రాహుల్ కెప్టెన్సీని వదిలేస్తాడని తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. చివరి రెండు మ్యాచుల్లోనూ గెలిస్తేనే లక్నోకు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో మేనేజ్‌మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు’ అని ఐపీఎల్ వర్గాలు పేర్కొన్నాయి.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
ఐపీఎల్‌లోకి లక్నో ప్రాంచైజీ అడుగుపెట్టినప్పటినుంచి కేఎల్ రాహుల్ నాయకత్వం వహిస్తున్నాడు. అతడి సారద్యంలో జట్టు 2022, 2023 సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఈసారి కూడా ప్లే ఆఫ్స్ దిశగా దూసుకెళ్లినా.. గత రెండు మ్యాచుల్లో భారీ ఓటమితో అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మిగిలిన రెండు మ్యాచుల్లోనూ గెలిచినా ప్లే ఆఫ్స్‌కు వెళ్తామనే గ్యారంటీ లేదు. దీంతో వచ్చే సీజన్ కోసం కొత్త కెప్టెన్‌ను ఎంచుకొనే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. 2025 మెగా వేలానికి ముందు రాహుల్‌ను రిటైన్ చేసుకునే అవకాశాలు చాలా తక్కువని వార్తలు వస్తున్నాయి. ఫ్రాంచైజీ ఓనర్ కెమెరాల ముందే సీరియస్‌గా మాట్లాడటంతో కేఎల్ రాహుల్ నోచుకున్నాడట. దాంతో స్వయంగా అతడు జట్టును వీడే ఛాన్స్ ఉందని కొందరు అంటున్నారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!