Site icon NTV Telugu

DC vs GT: సెంచరీతో చెలరేగిన కేఎల్ రాహుల్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే..?

Gt

Gt

DC vs GT: ఐపీఎల్‌-2025లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు చెలరేగిపోయి ఆడారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 199 రన్స్ చేసింది. డీసీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీతో రెచ్చిపోయాడు. 65 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 112 పరుగులు చేశాడు కేఎల్ రాహుల్. అతడికి ఇది ఐదో ఐపీఎల్ శతకం. కాగా, రాహుల్‌తో పాటు అభిషేక్ పోరెల్‌ (30), అక్షర్ పటేల్‌ (25), స్టబ్స్‌ (21) పర్వాలేదనిపించారు. మరోవైపు గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో అర్షద్ ఖాన్‌, సాయి కిషోర్‌, ప్రసిద్ద్ కష్ణ తలా వికెట్ తీసుకున్నారు.

Read Also: Pawan Kalyan : ‘మనల్ని ఎవడ్రా ఆపేది’.. పవన్ డైలాగ్ తో ఏస్ ట్రైలర్..

కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 8 వేల పరుగులు పూర్తి చేసుకున్న భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ రికార్డును సైతం అతడు బ్రేక్ చేసేశాడు. కోహ్లీ 243 ఇన్నింగ్స్‌ల్లో 8 వేల పరుగుల మైలురాయి చేరుకోగా.. కేఎల్ రాహుల్ కేవలం 224 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ అందుకున్నాడు.

Exit mobile version