KKR vs SRH: అతడే మమ్మల్ని దెబ్బ కొట్టాడు: పాట్ కమిన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SRH Captain Pat Cummins Said KKR bowled fantastically in IPL 2024 Final: ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ తమను దెబ్బకొట్టాడని సన్‌రైజర్స్ హైదరాబాద్ సారథి పాట్ కమిన్స్ తెలిపాడు. కోల్‌కతానైట్ రైడర్స్ బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ వేశారని ప్రశంసించాడు. చెన్నై పిచ్ 200 ప్లస్ వికెట్ కాదని, 160 పరుగులు చేసి ఉంటే మ్యాచ్ రేసులో ఉండేవాళ్లమన్నాడు. ఐపీఎల్ టోర్నీలో ఆడటం ఎప్పటికీ గుర్తుండిపోతుందని కమిన్స్ చెప్పుకొచ్చాడు. ఎస్ఆర్హెచ్ నిర్ధేశించిన 114 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 10.3 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. దాంతో కోల్‌కతా ఖాతాలో మూడో ఐపీఎల్ ట్రోఫీ చేరింది.
మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ మాట్లాడుతూ… ‘కోల్‌కతా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. దురదృష్టవశాత్తు నా సహచరుడు మిచెల్ స్టార్క్ మరోసారి విజృంభించాడు. ఈరోజు మేం అనుకున్న విధంగా ఆడలేకపోయాం. కొన్ని బౌండరీలను కొట్టి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. మాకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బౌలింగ్ చేశారు. అహ్మదాబాద్‌లో గత వారం మాదిరిగానే.. వారు బాగా బౌలింగ్ చేశారు. ఈ విజయం పూర్తి క్రెడిట్ బౌలర్లదే. ఇది మంచి బౌలింగ్ వికెట్. 200 ప్లస్ వికెట్ కాదు. మేం 160 పరుగులు చేసి ఉంటే రేసులో ఉండేవాళ్లం’ అని అన్నాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: KKR vs SRH: ముందుగా బౌలింగ్ చేయడం కలిసొచ్చింది.. సన్‌రైజర్స్‌కు థ్యాంక్స్: శ్రేయస్ అయ్యర్
‘ఈ సీజన్లో మాకు చాలా సానుకూలాంశాలు ఉన్నాయి. కుర్రాళ్లు తమ సత్తాను నిరూపించుకొనేందుకు ఉత్సాహం చూపారు. 250 పైగా స్కోర్లను మేం మూడుసార్లు సాధించాం. అంటే మా బ్యాటర్ల ఆటతీరు ఏ స్థాయిలో ఉందోఅర్ధమచేసుకోవచ్చు. తీవ్ర ఒత్తిడిలోనూ పోరాటపటిమ చూపించాం. భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, జయ్‌దేవ్ ఉనద్కత్ వంటి బౌలర్లతో పని చేయడం చాలా బాగుంది. ఇలాంటి పెద్ద టోర్నీలో ఆడటం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రతి సంవత్సరం మరింత మెరుగ్గా ఐపీఎల్ జరుగుతుంది’ అని కమిన్స్ పేర్కొన్నాడు. ఫైనల్లో స్టార్క్ 3 ఓవర్లలో రెండు వికెట్స్ తీసి 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
తాజావార్తలు
-
Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
-
Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
-
Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
-
Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
-
The Paradise : ఏపీలో ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల హైక్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!