Andre Russell, Ananya Panday’s Dance Video Goes Viral: కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఐపీఎల్ 2024 టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. మే 26న చెపాక్ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పదేళ్ల టైటిల్ కరువును తీర్చుకోవడమే కాకుండా.. మూడో ట్రోఫీని ఖాతాలో వేసుకుంది. ఫైనల్లో విజయం తర్వాత కేకేఆర్ ప్లేయర్స్ మైదానంలోనే భారీ సంబరాలు చేసుకున్నారు. ఇక రాత్రి జరిగిన పార్టీలో కేకేఆర్ స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు.
ఐపీఎల్ 2024 టైటిల్ గెలిచిన కేకేఆర్ ఆటగాళ్లకు ఆ జట్టు యాజమాన్యం నైట్ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ పార్టీలో ఆండ్రీ రస్సెల్ తెగ సందడి చేశాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండేతో కలిసి రస్సెల్ డాన్స్ చేశాడు. పంజాబీ పాట ‘లుట్ పుట్ గయా’ అనే పాటకు ఇద్దరు స్టెప్స్ వేశారు. ఈ పాటషారుఖ్ ఖాన్ నటించిన ‘డుంకీ’ సినిమాలోనిది. ఇందుకు రస్సెల్, అనన్య డాన్స్‌కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘రస్సెల్ భలే లక్కీ’, ‘మొన్న అవికా.. నేడు అనన్య’ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Pushpa 2 The Rule: సూసేకి సాంగ్ లుక్.. కలర్‌ఫుల్‌గా పుష్ప, శ్రీవల్లి!
నైట్ పార్టీలో బాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్, అతడి భార్య గౌరీ ఖాన్, కూతురు సుహానా ఖాన్, కుమారుడు ఆర్యన్ ఖాన్ పాల్గొన్నారు. అనన్య పాండే సహా మరికొందరు స్టార్ కూడా కోల్‌కతా ఆటగాళ్లతో సంబరాలు చేసుకున్నారు. వెస్టిండీస్ ప్లేయర్లకు మైదానం, పార్టీలో డాన్స్‌లు వేయడం మామూలే. వెరైటీ డాన్స్‌లతో విండీస్ వీరులు అలరిస్తుంటారు. ఐపీఎల్ 2024లో ఆండ్రీ రస్సెల్ ఆల్‌రౌండర్‌గా ఆకట్టుకున్నాడు. కోల్‌కతా టైటిల్ గెలవడంతో అతడు కీలక పాత్ర పోషించాడు.
Andre Russell enjoying “Lutt Putt Gaya” Song during the IPL winning Party. 😄👌 pic.twitter.com/Q8sg53FuFi
— Johns. (@CricCrazyJohns) May 27, 2024