KKR Defeats Reasons: వేలం తప్పిదాలు, గాయాలు, అనిశ్చితి.. కేకేఆర్ వరుస ఓటములకు ఎన్నో కారణాలు!
- ఐపీఎల్ 2026లో కేకేఆర్ వరుస ఓటములు
- 5 మ్యాచ్లలి నాలుగింటిలో ఓటమి, ఒకటి రద్దు
- కేకేఆర్ వరుస ఓటములకు కారణాలు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) వరుస ఓటములను ఎదుర్కొంటోంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడగా.. నాలుగింటిలో ఓడిపోయింది. ఆ ఒక్క మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఖాతాలో ఒక్క పాయింట్ ఉన్న కేకేఆర్.. పట్టికలో అట్టడుగున 10వ స్థానంలో ఉంది. దాంతో కోల్‌కతాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ వరుస ఓటముల నేపథ్యంలో కెప్టెన్ అజింక్య రహానే కూడా మార్పులు తప్పవని అంగీకరించాడు. కేవలం ఫామ్ లోపమే కాకుండా జట్టు నిర్మాణంలో ఉన్న లోపాలు కూడా బయటపడుతున్నాయి. కేకేఆర్ వరుస ఓటములకు కారణాలు ఏంటో ఓసారి చూద్దాం.
టాప్ ఆర్డర్లో లోపం:
కేకేఆర్ టాప్ ఆర్డర్లో దూకుడు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. అజింక్య రహానే నిలకడగా ఆడుతున్నప్పటికీ.. పవర్‌ప్లేలో దూకుడుగా ఆడడం లేదు. అతని స్ట్రైక్‌రేట్ బాగున్నా.. మ్యాచ్‌పై ప్రభావం చూపించే ఇన్నింగ్స్‌లు లేవు. మరోవైపు హిట్టర్ ఫిన్ అలెన్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేస్తున్నా.. భారీ స్కోర్లు చేయడంలో విఫలమవుతున్నాడు. అలెన్ కూడా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడడం లేదు. ఓపెనింగ్ కోల్‌కతాకు పెద్ద సమస్యగా మారింది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
మిడిల్ ఆర్డర్లో అనిశ్చితి:
టాప్ ఆర్డర్ విఫలం కావడంతో మిడిల్ ఆర్డర్‌పై ఒత్తిడి పెరిగింది. రఘువంశీ ఒక్కడే కాస్త పర్వాలేదనిపిస్తున్నాడు. రింకు సింగ్ ఈ సీజన్లో పరుగులు చేయడం లేదు. సునీల్ నరైన్ ఎక్కడ ఎప్పుడు ఆడుతాడో స్పష్టత లేదు. జట్టు మేనేజ్మెంట్ పదేపదే కాంబినేషన్ మార్చడం వల్ల కూడా స్థిరత్వం లేకుండా పోయింది. ముఖ్యంగా కామెరూన్ గ్రీన్‌ను నెంబర్ 6లో ఆడించడం పెద్ద తప్పిదం అనే చెప్పాలి. గ్రీన్ సాధారణంగా టాప్ ఆర్డర్‌లోనే రాణిస్తాడు. పావెల్ వచ్చేసరికి మ్యాచ్ ఓటమి అంచన ఉంటోంది.
కెమరూన్ గ్రీన్‌పై ఒత్తిడి:
రూ.25.2 కోట్ల భారీ ధరకు తీసుకున్న కెమరూన్ గ్రీన్ ఇప్పటివరకు ఒకటి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. అతడిపై ఉన్న అంచనాలను అందుకోలేకపోయాడు. బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ అతని ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ముఖ్యంగా అతడిని ఆండ్రీ రస్సెల్‌తో పోల్చితే.. ఆ లోటు స్పష్టంగా కనిపిస్తోంది.
వేలంలో తప్పిదాలు:
కేకేఆర్ ఈ పరిస్థితికి మరో ముఖ్య కారణం వేలంలో చేసిన తప్పిదాలు. ఆండ్రీ రస్సెల్‌ను రిలీజ్ చేయడం, మాజీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ను వదిలేయడం జట్టుకు భారీ దెబ్బగా మారింది. అలాగే ఫిల్ సాల్ట్ ను కూడా వదిలేయడంతో టాప్ ఆర్డర్ మరింత బలహీనపడింది. కేకేఆర్ ఈ నిర్ణయాలు జట్టు స్థిరత్వాన్ని దెబ్బతీశాయి.
బౌలింగ్‌లో లోపాలు:
బౌలింగ్‌లోనూ కేకేఆర్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ముస్తఫిజుర్ రెహమాన్ జట్టులో లేకపోవడం, హర్షిత్ రాణా, ఆకాష్ దీప్ గాయాలు జట్టును బలహీనపరిచాయి. అలాగే మతీషా పతిరానా అందుబాటులో లేకపోవడం బౌలింగ్ సమస్యను మరింత పెంచింది. సీనియర్ లీడ్ పేసర్ లేకపోవడంతో చివరి ఓవర్లలో పరుగులు కట్టడి చేయడం కష్టంగా మారుతోంది. కోల్‌కతా త్వరగా తప్పిదాలను సరిదిద్దుకుని కొత్త వ్యూహాలతో ముందుకు రాకపోతే.. ఈ సీజన్లో తిరిగి పుంజుకోవడం కష్టమే.
కోల్‌కతా తదుపరి మ్యాచ్‌లు:
ఏప్రిల్ 17: గుజరాత్, అహ్మదాబాద్
ఏప్రిల్ 19: రాజస్థాన్, ఈడెన్ గార్డెన్స్
ఏప్రిల్ 26: లక్నో, లక్నో
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?