Jitesh Sharma Is Better Than Sanju Samson Says Sunil Joshi: ఈ ఐపీఎల్ సీజన్‌లో కొందరు యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. అలాంటి వాళ్లలో జితేశ్ శర్మ ఒకడు. పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. కీపర్‌గా సత్తా చాటుతూ, బ్యాటింగ్ పరంగానూ దుమ్ముదులిపేస్తున్నాడు. మెరుపు ఇన్నింగ్స్‌లతో మైదానంలో పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. కొన్నిసార్లు కీలక ఇన్నింగ్స్ ఆడి.. జట్టు విజయంలో కీ-రోల్ పోషించిన సందర్భాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అతనిపై క్రీడాభిమానులతో పాటు మాజీలు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. అతడ్ని టీమిండియాకు ఎంపిక చేయాలని అభిప్రాయాలూ వ్యక్తపరుస్తున్నారు. ఇప్పుడు తాజాగా భారత మాజీ సెలెక్టర్ సునీల్ జోషి సైతం అదే అభిప్రాయాన్ని వెల్లడించాడు. సంజూ కంటే అతడు చాలా బాగా ఆడుతున్నాడని, అతనికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కల్పించాలని చెప్పాడు.
Road Accident: పెళ్లికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మరణం
సునీల్ జోషి మాట్లాడుతూ.. ‘‘ఈ ఐపీఎల్ సీజన్‌లో జితేశ్ శర్మ అద్భుతంగా ఆడుతున్నాడు. పంజాబ్‌కు మంచి ఫినిషింగ్ ఇస్తున్నాడు. కాబట్టి.. సంజూ శాంసన్ స్ధానంలో జితేష్ శర్మను భారత జట్టుకు ఎంపిక చేయాలి. సంజూ కంటే జితేష్ మెరుగైన ఆటగాడు. గత కొన్ని నెలల నుంచి అతడు దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ బ్రహ్మాండంగా రాణిస్తున్నాడు. అటువంటి ఆటగాడు కచ్చితంగా టీమిండియాకు ఆడాలి. గతంలో కొన్ని టీ20 సిరీస్‌లకు జితేష్ భారత జట్టులో భాగమయ్యాడు కూడా. కానీ, అతడ్ని బెంచ్‌కే పరిమితం చేశారు. ఈసారి మాత్రం అతనికి తుది జట్టులో ఛాన్స్ ఇవ్వండి. అతడు పంజాబ్ తరఫున ఎలా ఆడుతున్నాడో, టీమిండియా తరఫున అంతే అద్భుతంగా రాణిస్తాడు’’ అంటూ చెప్పుకొచ్చారు. తన సత్తా చాటుకోవడానికి, జితేశ్‌కు అవకాశం కల్పించాలని ఆయన కోరాడు. కాగా.. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 10 మ్యాచ్‌లో ఆడిన జితేశ్ శర్మ 165.97 స్ట్రైక్ రేట్‌తో239 పరుగులు చేశాడు. ఆఖరిలో బ్యాటింగ్‌కు వచ్చే ఇతగాడు.. పంజాబ్ జట్టుకు అద్భుతమైన ఫినిషర్‌గా మారాడు.
