NTV Telugu Site icon

Jio Cinema: రికార్డ్ క్రియేట్ చేసిన ఐపీఎల్ ఫైనల్.. జియో సినిమాకు 3.2 కోట్ల వీక్షకులు..

Jio Cenima

Jio Cenima

Jio Cinema: జియో సినిమా కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ ఏడాది ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను బిలియనీర్, రిలయన్స్ సంస్థ చైర్మన్ ముఖేష్ అంబానీకి చెందిన జియో సినిమా దక్కించుకుంది. ఫ్రీగా చూసే అవకాశం ఇవ్వడంతో జియో సినిమా డౌన్ లోడ్స్, వ్యూయర్ షిప్ బాగా పెరిగింది. తాజా నిన్న గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ను ఏకకాలంలో 3.2 కోట్ల మంది వీక్షించారు. వర్షం వల్ల ఆలస్యంగా మొదలై, ఆగుతూ.. సాగిన ఈ ఫైనల్ మ్యాచ్ ను దాదాపు 32 మిలియన్ల మంది ఏకకాలంలో వీక్షించారని Viacom18 ప్రతినిధి తెలిపారు.

Read Also: JD Chakravarthy : వార్నీ.. జేడి చక్రవర్తి ఆ టైపా.. ఒక్కరిని కూడా వదల్లేదా?

మరోవైపు అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియం కూడా ఇరు జట్ల ప్రేక్షకులతో నిండిపోయింది. ఈ స్టేడియం సామర్థ్యం 1,32,000. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి ఐపీఎల్ కప్ కొట్టింది. మరోవైపు వచ్చే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఇదే లాస్ట్ ఐపీఎల్ సీజన్ అనే వాదనల మధ్య మ్యాచ్ చూసే వారి సంఖ్య బాగా పెరిగింది.

ప్రస్తుతం జియో సినిమాను ఇండియాలో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ గా మార్చేందుకు రిలయన్స్ కసరత్తు చేస్తోంది. ఐపీఎల్ మ్యాచులను ఉచితంగా అందించడంతో దేశంలోొ దీని రీచ్ బాగా పెరిగింది. దీంతో పాటు ఇప్పటికే HBO మరియు వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ షోల హక్కులను పొందింది. కంటెంట్ చూడాలంటే ఛార్జీలను వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. రానున్న కాలంలో డిస్నీ హాట్ స్టార్, నెట్‌ఫ్లిక్స్ వంటి దిగ్గజాలకు పోటీ ఇవ్వబోతోంది.