NTV Telugu Site icon

Gambhir-SRK: బ్లాంక్‌ చెక్‌ ఆఫర్‌.. మన్నత్‌లో షారుక్‌తో గంభీర్‌ పలుమార్లు భేటీ!

Blank Cheque Gambhir

Blank Cheque Gambhir

Shah Rukh Khan and Gautam Gambhir Meets several times in Mannat: కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మూడోసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. చెపాక్ మైదానంలో మే 26న సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)తో జరిగిన ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో కేకేఆర్ ఘన విజయం సాధించింది. కేకేఆర్ టైటిల్ సాధించడంలో ఆ జట్టు మెంటార్‌ గౌతమ్‌ గంభీర్‌ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పక్కాగా ప్రణాళికలు రచిస్తూ.. వెనకుండి కోల్‌కతాను నడిపించాడు. ప్రస్తుతం గంభీర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే కోల్‌కతాతో పదేళ్లు ఉండేందుకు గంభీర్‌కు.. కేకేఆర్ సహా యజమాని షారుక్‌ ఖాన్ బ్లాంక్‌ చెక్‌ ఆఫర్‌ ఇచ్చిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

రెండేళ్ల పాటు లక్నో సూపర్ జెయింట్స్‌కు టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్‌ గంభీర్‌ మెంటార్‌గా ఉన్నాడు. అనూహ్యంగా లక్నోను వదిలి.. ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు మెంటార్‌గా వ్యవహరించాడు. గంభీర్‌ను కేకేఆర్‌కు తీసుకొచ్చేందుకు షారుక్ ఖాన్ చాలా పడ్డారట. 2018-2022 మధ్య షారుక్‌తో గంభీర్‌ తరచూ మన్నత్‌ (షారుక్ నివాసం)లో భేటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. షారుక్‌ బ్లాంక్‌ చెక్ ఆఫర్ ఇవ్వడంతో 2023లోనే లక్నోను వదిలేద్దామని గౌతీ అనుకున్నాడని తెలుస్తోంది. లక్నోతో మంచి సంబంధాలు ఉన్నప్పటికీ.. ఆ జట్టు నుంచి బయటకు రావాలని గంభీర్‌ నిశ్చయించుకున్నాడట. దాంతో గౌతీని షారుక్ తన ఇంటికి పిలిచాడట. ఇద్దరి మధ్య దాదాపు రెండు గంటల పాటు చర్చ జరిగినట్లు సమాచారం.

Also Read: Ananya Panday-Russell: నైట్ పార్టీ.. అనన్య పాండేతో ఆండ్రీ రస్సెల్!

షారుక్‌తో రెండు గంటల భేటీ అనంతరం కోల్‌కతాకు గంభీర్ రావడం ఖాయమైందని తెలుస్తోంది. ఈ విషయాన్ని ముందుగానే ఎల్‌ఎస్‌జీ ఓనర్ సంజీవ్‌ గోయెంకాకు గౌతీ చెప్పాడట. రెండేళ్లపాటు జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చిన గంభీర్‌.. టీంను వీడాలనే నిర్ణయం తీసుకోవడంతో గోయెంకా షాక్‌కు గురయ్యారట. ఇదంతా చూస్తుంటే గౌతీని కేకేఆర్‌కు తీసుకొచ్చేందుకు షారుక్ చాలానే కష్టపడినట్లు ఉంది. గంభీర్ రాకతో కేకేఆర్ ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. ప్రస్తుతం షారుక్ చాలా సంతోషంగా ఉన్నాడు.