Salil Aarora: SRH కు మరో కాటేరమ్మ కొడుకు.. సలీల్ అరోరా ఎవరు..? చరిత్ర చూస్తే పూనకాలే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్ ప్రపంచంలో రాత్రికి రాత్రే స్టార్లు పుట్టుకొస్తుంటారు. కానీ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఒక యువకుడు సృష్టించిన ప్రకంపనలు మాత్రం అసాధారణం. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా వంటి దిగ్గజ బౌలర్లు ఉన్న ముంబై ఇండియన్స్‌ను వారి సొంత గడ్డపైనే మట్టికరిపించి, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అద్భుత విజయాన్ని అందించాడు 23 ఏళ్ల పంజాబ్ యువకిరణం సలీల్ అరోరా.
చివరి రెండు ఓవర్లలో హైదరాబాద్ విజయానికి 11 పరుగులు కావాలి. బుమ్రా బౌలింగ్‌లో సిక్స్ కొట్టి తన రాకను చాటిన సలీల్, ఆపై హార్దిక్ పాండ్యా వేసిన 18వ ఓవర్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 10 బంతుల్లోనే 30 పరుగులు (నాటౌట్) సాధించి, ఐపీఎల్ చరిత్రలోనే వాంఖడేలో అత్యధిక రన్ ఛేజ్ రికార్డును నెలకొల్పాడు. ట్రావిస్ హెడ్, క్లాసెన్ వంటి దిగ్గజాలు పునాది వేస్తే, సలీల్ తన మెరుపులతో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
Salil Arora 𝙛𝙞𝙣𝙞𝙨𝙝𝙚𝙨 𝙩𝙝𝙞𝙣𝙜𝙨 𝙤𝙛𝙛 𝙞𝙣 𝙨𝙩𝙮𝙡𝙚 🙌#SRH delivers a calm, commanding finish to cap off a record-breaking run-chase at the Wankhede. 💪#TATAIPL | #MIvSRH #SunrisersHyderabad #HeinrichKlaasen #TravisHead #AbhishekSharma pic.twitter.com/5K8SLScDZu
— Star Sports (@StarSportsIndia) April 29, 2026
ఎవరీ సలీల్ అరోరా?
పంజాబ్ నుంచి వచ్చిన ఈ యువ ఆటగాడు దేశవాళీ క్రికెట్లో ఇప్పటికే తన సత్తా చాటాడు. రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌పై అరంగేట్రంలోనే సెంచరీ బాది ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో.. జార్ఖండ్‌పై కేవలం 45 బంతుల్లో 125 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ టోర్నీలో 198.88 స్ట్రైక్ రేట్‌తో 358 పరుగులు సాధించాడు. ఈ అద్భుత ప్రదర్శనే అతనికి సన్‌రైజర్స్ జట్టులో రూ. 1.50 కోట్ల కాంట్రాక్టును తెచ్చిపెట్టింది. నేడు ఆ పెట్టుబడి మాస్టర్ స్ట్రోక్ అని నిరూపితమైంది. కేవలం భారీ షాట్లు ఆడటమే కాదు, ఒత్తిడిలోనూ బుమ్రా వంటి బౌలర్లను ఎదుర్కోగల మానసిక దృఢత్వం సలీల్ సొంతం. ఈ విజయంతో హైదరాబాద్ పట్టికలో మూడో స్థానానికి చేరగా, ముంబైకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఐపీఎల్ వేదికపై ఒక కొత్త నక్షత్రం ఉదయించిందని.. అతనే సలీల్ అరోరాగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఖుషి ఖుషీగా ఉన్నారు.
తాజావార్తలు
-
Sai Dharam Tej : : ఫ్లాపుల్లో ఉన్నప్పుడు నాకిచ్చిన ఆ డబ్బు ఎప్పటికీ మర్చిపోలేను
-
Nani: నాని దర్శకత్వంలో సినిమా? హీరో కాకముందే పూర్తి స్క్రిప్ట్ రాసిపెట్టుకున్న న్యాచురల్ స్టార్!
-
Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
-
Chiranjeevi : బ్లడ్ అమ్ముకున్నానని అవమానించారు..
-
Mohan Babu: “ఆ సినిమా చూస్తే మీరు నా దగ్గరకు కూడా రారు..” మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!