Virat Kohli: కోహ్లీ నా మజాకా.. బాబర్ ఆజామ్‌కు ఇచ్చిపడేసిన కింగ్ కోహ్లీ.. బిగ్ రికార్డుతో స్ట్రాంగ్ కౌంటర్!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: టీ20 క్రికెట్‌లో పాకిస్థాన్‌కి చెందిన ప్లేయర్ బాబర్ ఆజామ్, భారత్‌కు చెందిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి మధ్య యుద్ధమే జరుగుతోంది. ఇద్దరూ రికార్డులు బ్రేక్ చేసుకుంటూ దూసుకెళ్తున్నారు. ఇటీవల పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజామ్ కింగ్ విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టేశాడు. కేవలం 338 ఇన్నింగ్స్‌ల్లోనే 12,000 పరుగుల మైలురాయిని చేరుకుని, ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇక మన విరాట్ కోహ్లీ మామూలోడు కాదు. ఈ బాబర్ రికార్డు సాధించిన వెంటనే విరాట్ కొత్త రికార్డును సృష్టించాడు. ఓ విధంగా చెప్పాలంటే.. బాబర్ ఆజామ్‌కు ఇచ్చిపడేశాడు కింగ్ కోహ్లీ.
READ MORE: Dead Body Door Delivery Case: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు షాక్.. పిటిషన్ కొట్టివేసిన కోర్టు..
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం(ఏప్రిల్ 13న) ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ముంబై ఇండియన్స్(MI) మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మరో అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ ముంబై బౌలర్లపై విరుచుకుపడుతూ ఆర్‌సీబీకి కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక సార్లు ‘సెంచరీ భాగస్వామ్యాల్లో’ (100+ Partnership) భాగమైన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. తన కెరీర్‌లో 47వ సారి వంద పరుగుల భాగస్వామ్యంలో పాలుపంచుకున్నాడు కోహ్లీ. ఈ రికార్డుతో పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజామ్‌ను వెనక్కి నెట్టేశాడు. బాబర్ ఆజామ్ (46), వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ (46) రికార్డులను అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాడు విరాటుడు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ (45), ఫాఫ్ డు ప్లెసిస్ (40) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ముంబైతో జరిగిన ఈ పోరులో ఫిల్ సాల్ట్ 36 బంతుల్లోనే 78 పరుగులు చేయగా, కోహ్లీ 50 పరుగులతో తన వంతు సహకారం అందించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!