Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గుజరాత్ టైటాన్స్ (GT) తో అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఈ మహా సంగ్రామంలో కోహ్లీ కేవలం 25 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ కెరీర్లోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీగా రికార్డుకెక్కింది.
అతని కెరీర్లో ఇంతకుముందు 2018లో రాజస్థాన్ రాయల్స్‌పై 26 బంతుల్లో, అదే ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్‌పై 26 బంతుల్లో, అలాగే 2025లో లక్నో సూపర్ జెయింట్స్‌పై 27 బంతుల్లో హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇప్పుడు ఆ రికార్డులన్నింటినీ తిరగరాస్తూ 25 బంతుల్లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు. కేవలం తన కెరీర్లోనే కాకుండా, ఐపీఎల్ ఫైనల్స్ చరిత్రలో కూడా అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ఆటగాళ్ల అరుదైన జాబితాలో కోహ్లీ చేరిపోయాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఐపీఎల్ ఫైనల్స్ చరిత్రలో సురేష్ రైనా (2010), డేవిడ్ వార్నర్ (2016), వెంకటేష్ అయ్యర్ (2024) 24 బంతుల్లో హాఫ్ సెంచరీలు చేసి అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ (2015), క్రిస్ గేల్ (2016) లతో పాటు ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా 25 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా వారి సరసన నిలిచాడు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం 28 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేసి క్రీజులో నాటౌట్‌గా ఉన్నాడు. అతని ఈ మెరుపు ఇన్నింగ్స్ ఆర్సీబీ జట్టును విజయానికి మరింత చేరవ చేసింది.
తాజావార్తలు
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
-
Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?