Mantralayam Road Accident: మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mantralayam Road Accident: కర్నూలు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం.. మంత్రాలయం సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామం సమీపంలో భక్తులతో ప్రయాణిస్తున్న బోలేరో గూడ్స్ వాహనం ట్యాంకర్‌ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం మేరకు, బోలేరో గూడ్స్ వాహనంలో మొత్తం 16 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. వీరంతా శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం మంత్రాలయానికి వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. మృతుల్లో నలుగురు మహిళలు, మూడు సంవత్సరాల బాలిక, డ్రైవర్ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Read Also: Lok sabha: నేటి నుంచి 3 రోజులు ప్రత్యేక సమావేశాలు.. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్‌పై చర్చ
Also Read
- UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
- Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
- Retired GST Commissioner Kidnap Case: విశాఖలో రిటైర్డ్ జీఎస్టీ కమిషనర్ కిడ్నాప్ కలకలం..
- Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
మృతులందరూ కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపూర్ జిల్లా తరికిరీ తాలూకా ఉదయ్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఘటన సమాచారం అందుకున్న మంత్రాలయం పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించగా, మృతదేహాలను ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ విషాద ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!