Virat Kohli: “అలా ఐతే క్రికెట్‌కు గుడ్ బై చెబుతా”.. విరాట్ కోహ్లీ సంచలన స్టేట్‌మెంట్.. ట్విస్ట్ ఏంటంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లోని ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. పలువురు క్రికెటర్లు, కోచ్‌లు దీనికి వ్యతిరేకంగా తమ వైఖరిని స్పష్టం చేస్తున్నారు. 2026 సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి దీనిపై రచ్చ కొనసాగుతోంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి నిబంధన లేదు కాబట్టి ఐపీఎల్‌లోనూ తీసేయాలని చాలామంది చెబుతున్నారు. అయినప్పటికీ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ నిబంధనను తొలగించే ఆలోచన చేయడం లేదు. ఇక ఈ అంశంపై తాజాగా ఓ వార్త వెలుగులోకి వచ్చింది.
READ MORE: Kangana Ranaut : కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో ప్రేమ.. క్లారిటీ ఇచ్చిన కంగనా
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
“నేను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడాల్సి వస్తే క్రికెట్‌కే రిటైర్మెంట్ ఇస్తాను” అని కోహ్లీ గతంలో అన్నట్లు అతని టీమ్ మేట్ స్వస్తిక్ చికారా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. కానీ, బుధవారం లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ అనూహ్యంగా అదే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను ఉపయోగించుకోవడం విశేషంగా మారింది. నిజానికి గత ఏడాది స్వస్తిక్ చికారా మాట్లాడుతూ.. “విరాట్ భయ్యా ఒక మాట చెప్పారు.. నేను క్రికెట్ ఆడినంత కాలం పూర్తి ఫిట్‌నెస్‌తోనే ఆడతాను. ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రం ఆడను. సింహంలా బరిలోకి దిగి 20 ఓవర్లు ఫీల్డింగ్ చేసి, ఆపై బ్యాటింగ్ చేస్తాను. ఏరోజైతే నేను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడాల్సిన పరిస్థితి వస్తుందో, ఆ రోజే క్రికెట్‌కు గుడ్ బై చెబుతాను” అని కోహ్లీ తనతో అన్నట్లు తెలిపాడు. అయితే ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో కోహ్లీ స్వల్పంగా గాయపడటంతో లక్నోతో జరిగిన పోరులో అతను ఫీల్డింగ్‌కు రాలేదు. కానీ ఛేదన సమయంలో మాత్రం ఫిల్ సాల్ట్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ మ్యాచ్‌లో 37 ఏళ్ల కోహ్లీ తన గాయం తాలూకు ఆనవాళ్లు ఏమాత్రం కనిపించకుండా 34 బంతుల్లో 49 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ అంశం ప్రస్తుతం వైరల్‌గా మారింది.
తాజావార్తలు
-
Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
-
The Paradise Collections: యాహూ ‘జడల్’ 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Oppo F35 Series: Oppo F35 సిరీస్ వచ్చేస్తోంది.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
-
PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
ట్రెండింగ్
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!