Virat Kohli World Record: SRH మ్యాచ్‌లో విఫలమైనా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. టీ20ల్లో ప్రపంచ రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli World Record: విరాట్ కోహ్లీ మరోసారి తన పేరును చరిత్ర పుస్తకాలలో నిలిపాడు. ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పెద్దగా పరుగులు చేయకపోయినా, కోహ్లీ అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ హై స్కోరింగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో 55 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యార్ కలిసి ఆరంభంలో వేగంగా పరుగులు సాధించారు. కోహ్లీ 11 బంతుల్లో 15 పరుగులు చేయగా, వెంకటేష్ అయ్యర్ కేవలం 19 బంతుల్లోనే 44 పరుగులు బాదాడు. అతని ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఇద్దరూ పవర్‌ప్లేలో వేగంగా ఆడటంతో ఆర్సీబీ కేవలం 3.5 ఓవర్లలోనే 50 పరుగులు దాటింది.
ఈ భాగస్వామ్యంతో కోహ్లీ టీ20 క్రికెట్లో అత్యధిక 50+ భాగస్వామ్యాల్లో పాల్గొన్న ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ అలెక్స్ హేల్స్ పేరిట ఉండేది. మ్యాచ్‌కు ముందు ఇద్దరూ 210 భాగస్వామ్యాలతో సమంగా ఉండగా, హైదరాబాద్ మ్యాచ్‌లో కోహ్లీ అతడిని అధిగమించాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
టీ20ల్లో అత్యధిక 50+ భాగస్వామ్యాల్లో పాల్గొన్న ఆటగాళ్లు
211 – విరాట్ కోహ్లీ
210 – అలెక్స్ హేల్స్
200 – డేవిడ్ వార్నర్
196 – బాబర్ ఆజమ్
191 – క్రిస్ గేల్
మరోవైపు.. ఈ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ, హెడ్ మధ్య సరదా మాటల యుద్ధం కూడా అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ట్రావిస్ హెడ్‌ను బౌలింగ్ చేయమంటూ కోహ్లీ సరదాగా సైగలు చేయడం కనిపించింది. అనంతరం హెడ్ బౌలింగ్‌లోనే ఆర్సీబీ కెప్టెన్ పటిదార్ ఔటయ్యాడు. మ్యాచ్ అనంతరం కూడా ఇద్దరి మధ్య హీట్ తగ్గినట్టు కనిపించలేదని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.. ఇక, మ్యాచ్ విషయానికి వస్తే, ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు చేసింది. అభిషేక్ శర్మ 56 పరుగులు, ఇషాన్ కిషన్ 79 పరుగులు, హెన్రిచ్ క్లాసెన్ 51 పరుగులు, నితీష్ కుమార్ రెడ్డి 29 పరుగులతో రాణించారు. అయితే టాప్-2 స్థానాన్ని దక్కించుకోవాలంటే ఎస్ఆర్హెచ్ కనీసం 90 పరుగుల తేడాతో గెలవాల్సి ఉండగా, ఆర్సీబీ బ్యాట్స్‌మెన్ చివర్లో సమర్థవంతంగా ఆడి ఆ అవకాశాన్ని దూరం చేశారు.
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!