Vaibhav Sooryavanshi: ఒకే వారంలో క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్ రికార్డులు బ్రేక్.. ఐపీఎల్లో వైభవ్ ఆల్‌టైమ్ హిస్టరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: ప్రస్తుతం క్రికెట్ ప్రపంచమంతా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ గురించే మాట్లాడుకుంటోంది. గత మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులతో విధ్వంసం సృష్టించిన ఈ రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాడు. ముల్లాన్‌పూర్‌లో జరిగిన ఈ కీలక పోరులో వైభవ్ ఎంతో పరిణతితో ఆడినప్పటికీ.. దురదృష్టవశాత్తూ మరోసారి సెంచరీ మార్కును అందుకోలేకపోయాడు. కేవలం 47 బంతుల్లో 96 పరుగులు చేసి సెంచరీకి అడుగు దూరంలో ఉండగా కగిసో రబడ బౌలింగ్‌లో అవుటయ్యాడు.
ఇక, ఈ అద్భుత ఇన్నింగ్స్ ద్వారా వైభవ్ సూర్యవంశీ క్రికెట్ దిగ్గజాల రికార్డులను బద్దలు కొట్టాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత తక్కువ బంతుల్లో 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ పేరిట ఉండేది. రస్సెల్ 566 బంతుల్లో ఈ మైలురాయిని అందుకుంటే, వైభవ్ దాన్ని కేవలం 440 బంతుల్లోనే అధిగమించి రస్సెల్ రికార్డును బద్దలుగొట్టాడు. ఐపీఎల్ అరంగేట్రం చేసినప్పటి నుంచి వైభవ్ ఒక సునామీలా దూసుకుపోతూ ఒకదాని తర్వాత ఒకటిగా రికార్డులన్నింటినీ తన పేరిట లిఖించుకుంటున్నాడు. గత మ్యాచ్‌లోనే ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ రికార్డును దాటేసిన ఈ వండర్ కిడ్, తాజా మ్యాచ్‌తో ఐపీఎల్ చరిత్రలోనే ఒకే సీజన్లో 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఇదిలా ఉండగా.. ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 29 బంతుల్లో 97 పరుగులు చేశాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ ఆడే క్రమంలో వైభవ్ సూర్యవంశీ యూనివర్స్ బాస్, వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉన్న ఒక చారిత్రాత్మక ఐపీఎల్ రికార్డును బద్దలు కొట్టాడు. ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా వైభవ్ సరికొత్త రికార్డును తన లిస్ట్‌లో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కొట్టిన సిక్సర్లతో కలిపి ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశీ మొత్తం సిక్సర్ల సంఖ్య 60కి పైగా చేరింది. ఇంతకుముందు 2012 సీజన్లో క్రిస్ గేల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతూ 59 సిక్సర్లు బాదాడు. గత 14 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ఈ ఆల్‌టైమ్ రికార్డును కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ అధిగమించడం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అప్పడు గేల్, ఇప్పుడు ఆండ్రీ రస్సెల్ ఇద్దరి రికార్డులను ఒకే వారంలో చెరిపేశాడు.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?