నేడు టాప్-2 కోసం తుది సమరం.. ఉప్పల్‌లో SRH vs RCB హై వోల్టేజ్ ఫైట్.. సన్‌రైజర్స్ సరికొత్త ప్లాన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SRH vs RCB: ఐపీఎల్లో ప్లేఆఫ్స్ బెర్త్‌లను ఇప్పటికే ఖరారు చేసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు.. ఇప్పుడు లీగ్ టేబుల్లో ‘టాప్-2’ స్థానం కోసం తలపడనున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి జరగబోయే ఈ పోరు ఇరు జట్లకు అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం బెంగళూరు జట్టు 13 మ్యాచ్‌లలో 18 పాయింట్లతో టేబుల్ టాప్‌లో కొనసాగుతుండగా.. హైదరాబాద్ జట్టు 13 మ్యాచ్‌లలో 16 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిస్తే లీగ్ దశలో అగ్రస్థానం అధికారికంగా ఖరారవుతుంది. తద్వారా ఫైనల్ చేరడానికి అదనంగా మరో అవకాశం (క్వాలిఫైయర్-1 రూపంలో) దక్కుతుంది.
ఈ సీజన్ మొదటి మ్యాచ్‌లోనే ఈ రెండు జట్లు చిన్నస్వామి స్టేడియంలో తలపడగా.. ఆ మ్యాచ్‌లో బెంగళూరు సునాయాస విజయాన్ని అందుకుంది. అయితే టోర్నమెంట్ ముందుకు సాగుతున్న కొద్దీ హైదరాబాద్ పుంజుకుని అద్భుతమైన ఫామ్‌లోకి వచ్చింది. దీంతో హోమ్ గ్రౌండ్లో ఆర్సీబీపై పాత పగ తీర్చుకోవడంతో పాటు లీగ్ దశను విజయంతో ముగించాలని ఎస్ఆర్హెచ్ పట్టుదలగా ఉంది. హైదరాబాద్ జట్టులో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (367 పరుగులు) ఈ మధ్య ఆశించిన స్థాయిలో ఆడకపోయినప్పటికీ.. అభిషేక్ శర్మ (507), ఇషాన్ కిషన్ (490)లతో కూడిన టాప్ ఆర్డర్ ప్రత్యర్థులపై విరుచుకుపడుతోంది. వీటికి తోడు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ (555) నిలకడైన ప్రదర్శన జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. బౌలింగ్ విభాగంలో కెప్టెన్ పాట్ కమిన్స్ పునరాగమనం జట్టుకు బలాన్నివ్వగా, ఈషాన్ మలింగ (17 వికెట్లు), సాకిబ్ హుస్సేన్ (14), ప్రఫుల్ హింగే (11)లు రాణిస్తున్నారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
అయితే, అన్ని విభాగాల్లోనూ తిరుగులేని ఫామ్‌తో దూసుకుపోతున్న ఆర్సీబీని అడ్డుకోవడం హైదరాబాద్ హోమ్ టీమ్‌కు అంత సులువు కాదు. అంతర్జాతీయ క్రికెట్లో టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పినప్పటికీ.. ఐపీఎల్లో విరాట్ కోహ్లీ (542 పరుగులు) ఒంటిచేత్తో మ్యాచ్‌లను శాసిస్తున్నాడు. రన్ మెషీన్ కోహ్లీకి తోడుగా దేవదత్ పడిక్కల్ (412), కెప్టెన్ రజత్ పాటిదార్ (337) బ్యాటింగ్‌లో అండగా నిలుస్తున్నారు. వీరికి తోడుగా టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, రొమారియో షెపర్డ్ వంటి భారీ హిట్టర్లు ఉండటం ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్‌ను మరింత ప్రమాదకరంగా మార్చింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా మూడు విభాగాల్లోనూ దుమ్మురేపుతున్న డిఫెండింగ్ ఛాంపియన్స్‌ను వారి సొంతగడ్డపైనే ఢీకొట్టేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ వ్యూహాలు రచిస్తోంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టాప్-2 లో నిలిచేది ఎవరో చూడాలి.
తాజావార్తలు
-
King : కరీనా కపూర్- షారూఖ్ ఖాన్ రీ-యూనియన్
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
-
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
-
Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!