SRH vs DC: కాటేరమ్మ కొడుకు అభిషేక్ శర్మ ఊచకోత.. ఢిల్లీ ముందు కొండంత లక్ష్యం..

Srh Vs Dc Ipl 2026

Srh Vs Dc Ipl 2026

SRH vs DC: ఐపీఎల్ 2026లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), ఢిల్లీ క్యాపిటల్స్(DC) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్ ఊకకోత కోసింది. రెండు వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విధ్వంసరక బ్యాటర్, ఓపెనర్ అభిషేక్ శర్మ(135) మెరుపు శతకం సాధించాడు. మొదట ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ఇద్దరూ అద్భుతంగా ఆడారు. పవర్‌ప్లే తర్వాత హైదరాబాద్ స్కోరు 67-0కు చేరింది. తొమ్మిదో ఓవర్‌లో అభిషేక్ శర్మ కేవలం 25 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. అయితే, అదే ఓవర్‌లో అక్షర్ పటేల్ బౌలింగ్‌లో హెడ్ 37 పరుగుల వద్ద ఔటవడంతో హైదరాబాద్‌కు తొలి ఎదురుదెబ్బ తగిలింది. అయినప్పటికీ, ఆ తర్వాత అభిషేక్ శర్మ జోరును ఆపడం ఢిల్లీ బౌలర్ల వల్ల కాలేదు. ఎనిమిది ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు బాది కేవలం 47 బంతుల్లోనే తన శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇక నితీష్ రాణా చేతిలో కెప్టెన్ ఇషాన్ కిషన్ (25) పెవిలియన్‌కు చేరాడు. హెన్రిచ్ క్లాసెన్(37)తో కలిసి అభిషేక్ రెచ్చిపోయాడు. 68 బాల్స్‌లో 135 పరుగులు చేసిన నాటౌట్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలుపునకు 143 పరుగులు అవసరం.

READ MORE: Bengaluru Horror: వెస్ట్రన్ స్టైల్‌లో ప్రపోజ్ చేస్తానని.. ప్రియుడిని కట్టేసి, కాల్చి చంపిన మహిళ..

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివంగ్ కుమార్, హర్ష్ దూబే, సాకిబ్ హుస్సేన్, ఇషాన్ మలింగ.

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): పతుమ్ నిస్సంక, కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీ, నితీష్ రాణా, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, టి. నటరాజన్, లుంగి ఎంగిడి.