SRH: సన్‌రైజర్స్ కీలక నిర్ణయం.. బ్రైడన్ కార్స్ ప్లేస్‌లో ఆ స్టార్ పేసర్ ఎంట్రీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SRH: ఎస్‌ఆర్‌హెచ్ నుంచి కీలక సమాచారం వెలువడింది. గాయం కారణంగా ఇంగ్లాండ్ పేసర్ బ్రైడన్ కార్స్ దూరమైన విషయం తెలిసిందే. కార్స్ స్థానంలో శ్రీలంకకు చెందిన ఎడమచేతి వాటం బౌలర్ దిల్షాన్ మధుశంకను జట్టులోకి తీసుకున్నట్లు సన్‌రైజర్స్ మంగళవారం ప్రకటించింది. మదుశంకను రూ.75 లక్షలకు ఎస్‌ఆర్‌హెచ్ కొనుగోలు చేసింది. మధుశంక శ్రీలంక తరఫున 1 టెస్టు, 28 వన్డేలు, 19 టీ20లు ఆడి అంతర్జాతీయ క్రికెట్‌లో 70 వికెట్లు పడగొట్టాడు. ఈ శ్రీలంక బౌలర్ గతంలో ముంబై ఇండియన్స్ (MI) జట్టులో ఆడాడు. ఎస్‌ఆర్‌హెచ్ తరఫున బాగా రాణిస్తాడని ఆశిస్తున్నారు.
READ MORE:YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్‌వో శ్రీహరి అరెస్ట్..
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఇదిలా ఉండగా.. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బౌలర్ బ్రైడన్ కార్స్ గాయపడ్డాడు. మార్చి 28న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన సీజన్ తొలి మ్యాచ్‌లోనూ ఆడలేదు. వాస్తవానికి.. కార్స్ కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్. ఇక నెట్స్ ప్రాక్టీస్ సమయంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కార్స్ కుడి చేతికి బంతి బలంగా తగిలింది. దీంతో అతని చేయి వాచిపోయింది. మొదట తీవ్రత తక్కువగానే ఉంటుందని అందరూ భావించారు. తరువాత వాపు పెరగడంతో బాల్ పట్టుకోవడానికి (గ్రిప్) ఇబ్బంది పడ్డాడు. ఇక ఆర్సీబీతో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఓటమి అనంతరం ఎస్‌ఆర్‌హెచ్ హెడ్ కోచ్ డేనియల్ వెట్టోరి కార్స్ పరిస్థితిపై స్పందించారు. “అతని చేతికి ఎముకలేవీ విరగలేదు. కానీ వాపు ఎక్కువగా ఉంది. మ్యాచ్ ఆడటానికి తను ప్రయత్నించినప్పటికీ, బంతిని పట్టుకోవడం కష్టంగా మారుతోంది. అతను కోలుకుంటున్నాడు, కోల్‌కతాలో జరిగే తదుపరి మ్యాచ్‌కల్లా అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్నాం” అని వెట్టోరి తెలిపారు. అయితే ఆ తర్వాత జరిగిన మ్యాచులకు సైతం కార్స్ దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో మధుశంక ఎంట్రీ ఇచ్చాడు.
తాజావార్తలు
-
Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
-
TG TET 2026 : టీచర్లకు గుడ్ న్యూస్.. ప్రత్యేక TG TET-2026-II నోటిఫికేషన్.!
-
Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
-
Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
-
Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?