SRH Lowest Score: ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డు.. 86 పరుగులకే కుప్పకూలిన ఆరెంజ్ ఆర్మీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SRH Lowest Score: నిన్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఓ పీడకలలా మారింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ, కేవలం 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలిపోయింది. గుజరాత్ బౌలర్ కగిసో రబడ బౌలింగ్‌లో నిప్పులు చెరిగేగాడు. అద్భుతమైన బౌలింగ్‌తో హైదరాబాద్ పతనాన్ని శాసించాడు. పవర్‌ప్లేలోనే మూడు కీలక వికెట్లు తీసి ఎస్ఆర్హెచ్ నడ్డి విరిచిన రబడ, తన 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక, ఈ ఘోర పరాజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఎస్ఆర్హెచ్ నమోదు చేసిన అత్యల్ప స్కోరు ఇదే కావడం గమనార్హం. 2019లో ముంబై ఇండియన్స్‌పై 96 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తాజాగా ఆ రికార్డును చెరిపేసి మరో చెత్త రికార్డ్‌ను ఖాతాలో వేసుకుంది.
ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ అత్యల్ప స్కోర్లు ఇవే:
86 vs గుజరాత్ టైటాన్స్, అహ్మదాబాద్ (2026)
96 vs ముంబై ఇండియన్స్, హైదరాబాద్ (2019)
113 vs ముంబై ఇండియన్స్, హైదరాబాద్ (2015)
113 vs కేకేఆర్, చెన్నై (2024 ఫైనల్)
114 vs పంజాబ్ కింగ్స్, దుబాయ్ (2022)
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఇక నిన్నటి మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్ల ధాటికి హైదరాబాద్ బ్యాటర్ల వద్ద సమాధానమే లేకపోయింది. స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఖాతా తెరవకుండానే వెనుదిరగ్గా.. అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి సహా మరో ఐదుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. ఈ భారీ ఓటమి సన్‌రైజర్స్‌ను పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి నెట్టగా, గుజరాత్ టైటాన్స్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. లీగ్ దశ ముగింపునకు చేరువవుతున్న వేళ, రెండు జట్లకు ఇంకా రెండేసి మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ ఓటమి మరిచి ఇక ముందున్న రెండు మ్యాచులపై దృష్టి సారిచాలి.
తాజావార్తలు
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!