SRH IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ప్రయాణం ముగిసింది. మే 27న ముల్లాన్‌పూర్ (న్యూ చండీగఢ్) వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో హైదరాబాద్ 47 పరుగుల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్ మొత్తంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్‌లో అద్భుతమైన ప్రదర్శనలు చేసింది. ముఖ్యంగా ఓపెనర్ ఇషాన్ కిషన్, హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ ఇద్దరూ పరుగుల వరద పారించారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఐపీఎల్ చరిత్రలోనే ఒక అరుదైన ఎలైట్ లిస్ట్‌లో చోటు సంపాదించుకున్నారు. ఒకే ఐపీఎల్ సీజన్‌లో ఒకే జట్టు తరఫున ఇద్దరు వేర్వేరు బ్యాటర్లు 600 కంటే ఎక్కువ పరుగులు చేసిన 7వ జోడీగా ఇషాన్ కిషన్ – హెన్రిచ్ క్లాసెన్ రికార్డు సృష్టించారు. ఈ ఇద్దరి పార్ట్నర్షిప్ జట్టుకు మంచి ఊపునిచ్చిందనే చెప్పాలి.
ఒకే ఐపీఎల్ సీజన్‌లో ఒకే జట్టు నుంచి 600+ పరుగులు పార్ట్నర్షిప్:
క్రిస్ గేల్ & విరాట్ కోహ్లీ (RCB – 2013)
విరాట్ కోహ్లీ & ఏబీ డివిలియర్స్ (RCB – 2016)
రుతురాజ్ గైక్వాడ్ & ఫాఫ్ డు ప్లెసిస్ (CSK – 2021)
విరాట్ కోహ్లీ & ఫాఫ్ డు ప్లెసిస్ (RCB – 2023)
శుభ్‌మన్ గిల్ & సాయి సుదర్శన్ (GT – 2025)
శుభ్‌మన్ గిల్ & సాయి సుదర్శన్ (GT – 2026)
హెన్రిచ్ క్లాసెన్ & ఇషాన్ కిషన్ (SRH – 2026)
ఎలిమినేటర్ మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 243 పరుగుల భారీ స్కోరు సాధించింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులతో విధ్వంసం సృష్టించగా, ధ్రువ్ జురెల్ 21 బంతుల్లో 50 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఆ తర్వాత 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌ను రాజస్థాన్ బౌలర్లు సమర్థవంతంగా కట్టడి చేశారు. రాజస్థాన్ స్పీడ్‌స్టర్ జోఫ్రా ఆర్చర్ తన 4 ఓవర్లలో 58 పరుగులు ఇచ్చినప్పటికీ, కీలకమైన 3 వికెట్లు పడగొట్టి జట్టును ముందుండి నడిపించాడు. అతనికి తోడుగా రవీంద్ర జడేజా, సుశాంత్ మిశ్రా, నాండ్రే బర్గర్ తలో రెండు వికెట్లు తీసుకోగా.. యశ్ రాజ్ పుంజా ఒక వికెట్ సాధించాడు. రాజస్థాన్ బౌలర్ల ధాటికి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 196 పరుగులకే పరిమితమై, 47 పరుగుల తేడాతో మ్యాచ్‌ను చేజార్చుకుంది.
