Shubman Gill: “మా ప్లాన్ వర్కవుట్ అయింది”.. హైదరాబాద్‌పై భారీ విజయం తర్వాత గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shubman Gill: నిన్న(మంగళవారం) గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పేకమేడలా కూలిపోయారు. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్, కేవలం 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలింది. ఇక, సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సాధించిన భారీ విజయంపై గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆనందం వ్యక్తం చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం తమకు బాగా కలిసి వచ్చిందన్నాడు. ఇలాంటి పిచ్‌పై 170 పరుగులు సాధించడం ఛేజింగ్ చేసే జట్టుకు ఎప్పుడూ సవాలే అన్నాడు. సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తే కచ్చితంగా ప్రత్యర్థిని కట్టడి చేయొచ్చనే నమ్మకంతో బరిలోకి దిగామని గిల్ వివరించాడు. ముఖ్యంగా తమ బౌలింగ్ అటాక్ సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 160 నుంచి 170 పరుగుల మధ్య టార్గెట్ సెట్ చేయాలని ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని, అది సరిగ్గా వర్కవుట్ అయిందని చెప్పాడు.
ఒక దశలో 170 పరుగుల మైలురాయిని అందుకోవడం కష్టమనిపించినా, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారని గిల్ అభినందించాడు. అలాగే పవర్‌ప్లేలో తమ బౌలర్లు గత కొన్ని మ్యాచ్‌లుగా కనబరుస్తున్న నిలకడను మెచ్చుకుంటూ, ఈ మ్యాచ్‌లోనూ వారు కీలక పాత్ర పోషించారని కొనియాడాడు. ఇక టేబుల్ టాపర్లుగా ఎదగడంపై స్పందిస్తూ.. తాము ఏదో ఒక ప్రత్యేకమైన శైలికి కట్టుబడి ఉండమని, పిచ్ పరిస్థితులను బట్టి తమ ఆటను మార్చుకుంటామని స్పష్టం చేశాడు. ఒకవేళ అది 240 పరుగులు చేసే వికెట్ అయితే అలాగే ఆడతామని, ఒకవేళ కష్టమైన వికెట్ అయితే 140 పరుగుల కంటే 170-180 పరుగులు చేయడం ఎంత కీలకమో తమకు తెలుసన్నాడు. ఆ విషయంలో జట్టుగా తాము చాలా స్పష్టతతో ఉన్నామని తెలిపాడు. జట్టులోకి జాసన్ హోల్డర్ రాక గురించి మాట్లాడుతూ.. అతను ఎంతో అనుభవజ్ఞుడని, నిలకడైన లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తూ జట్టుకు అదనపు బలాన్ని ఇస్తున్నాడని గిల్ పేర్కొన్నాడు. ముఖ్యంగా ఈ ఎండల తీవ్రతలోనూ పట్టువదలకుండా వరుసగా నాలుగు ఓవర్లు వేయడం అంత సులభం కాదని, కానీ హోల్డర్ జట్టు కోసం తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాడని ఆనందం వ్యక్తం చేశాడు. మొత్తానికి ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా ఎంత కఠినంగా ఉండాలో అంత కఠినంగా ఉంటూ మున్ముందు ఇదే జోరును కొనసాగిస్తామని గిల్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?