రాయ్‌పూర్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో గెలిచిన RCB, ప్లేఆఫ్స్ దిశగా బలమైన అడుగు వేసింది. 193 పరుగుల భారీ లక్ష్యాన్ని విరాట్ కోహ్లీ అజేయ సెంచరీతో (60 బంతుల్లో 105) మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ విజయంతో RCB 12 మ్యాచ్‌ల్లో 16 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
ప్లేఆఫ్స్ అవకాశాలు..
పాయింట్ల పట్టికలో RCB టాప్‌లో ఉన్నప్పటికీ, ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు గుజరాత్ టైటాన్స్‌కే (94.8%) ఎక్కువగా ఉన్నాయి. ఇతర జట్ల అవకాశాలు చూస్తే.. RCB: 92.6 శాతం, సన్‌రైజర్స్ హైదరాబాద్ కు 64.7 శాతం, పంజాబ్ కింగ్స్ కు 62.8 శాతం, చెన్నై సూపర్ కింగ్స్ కు 41.7 శాతం, రాజస్థాన్ రాయల్స్ కు 40.6 శాతం, KKRకు కేవలం 1.8 శాతం (మిగిలిన 3 మ్యాచ్‌లు గెలిచినా అర్హత సాధించడం కష్టమే) మాత్రమే ఉన్నాయి. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ 1 శాతం ఉండగా.. లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.
