Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
- కేకేఆర్‌పై అద్భుత సెంచరీతో ఫామ్‌లోకి తిరిగొచ్చిన విరాట్ కోహ్లీ
- వరుసగా రెండు డకౌట్ల తర్వాత కోహ్లీపై వచ్చిన విమర్శలకు ఘన సమాధానం
- కోహ్లీతో కలిసి “100” సంకేతంతో ఫొటో పోస్ట్ చేసిన కృనాల్ పాండ్యా
- “I told you so” అంటూ వైరల్ క్యాప్షన్ ఇచ్చిన కృనాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Century: విరాట్ కోహ్లీ (Virat Kohli) మరోసారి తన క్లాస్‌ను చూపించాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన తర్వాత తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కోహ్లీ, కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై అద్భుత సెంచరీతో ఘనంగా తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అతడి ఈ ఇన్నింగ్స్ జట్టుకు కీలక విజయాన్ని అందించింది. ఇక మ్యాచ్ అనంతరం ఆర్సీబీ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. కోహ్లీతో కలిసి “100” సంకేతాన్ని చేతులతో చూపిస్తూ ఫొటో పోస్ట్ చేసిన కృనాల్, “I told you so” (నేనే చెప్పాను కదా..) అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. కోహ్లీ తిరిగి భారీ ఇన్నింగ్స్ ఆడతాడని తాను ముందే చెప్పానని ఆయన ఆ పోస్టుతో గుర్తుచేశాడు.
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ వరుసగా రెండో డకౌట్ నమోదు చేసిన తర్వాత కూడా కృనాల్ అతడిపై పూర్తి నమ్మకం వ్యక్తం చేశాడు. ఆయన మాట్లాడుతూ.. “విరాట్ కోహ్లీ ఓ ఛాంపియన్ ప్లేయర్. అతడు రెండు మ్యాచ్‌ల్లో విఫలమైతే నాకు ఇంకా ఎక్కువ ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే అతడు బలంగా తిరిగి వస్తాడని నాకు తెలుసు. కోహ్లీ గురించి మాకు ఎలాంటి టెన్షన్ ఉండదు” అని వ్యాఖ్యానించాడు. ఇకపోతే ఈ మ్యాచ్‌లో కోహ్లీ పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు. టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా 14 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. అలాగే టీ20ల్లో 10 సెంచరీలు చేసిన తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ రన్ చేజ్ లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో జోస్ బట్లర్ సరసన చేరాడు.
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన RCB ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీనితో మొదట బ్యాటింగ్ చేసిన KKR నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అంగ్క్రిష్ రఘువంశీ 71 నాటౌట్, రింకూ సింగ్ 49 నాటౌట్‌తో జట్టును ఆదుకున్నారు. లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఆరంభంలోనే జేకబ్ బెథెల్ వికెట్ కోల్పోయినా, కోహ్లీ-దేవదత్ పడిక్కల్ జోడీ కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. పడిక్కల్ 39 పరుగులు చేయగా, చివర్లో కోహ్లీ తనదైన శైలిలో దూకుడుగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆర్సీబీ 19.1 ఓవర్లలో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో 16 పాయింట్లు సాధించింది. మరోవైపు కేకేఆర్ ప్లేఆఫ్ అవకాశాలు ప్రమాదంలో పడ్డాయి. ఇక మిగిలిన మూడు మ్యాచ్‌లు వారికి కీలకంగా మారాయి.
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!