Pat Cummins: ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ప్యాట్ కమిన్స్ ఎంట్రీపై క్లారిటీ వచ్చేసిందోచ్..!

Pat Cummins

Pat Cummins

Pat Cummins: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అభిమానులకు గుడ్‌న్యూస్ వచ్చేసింది. జట్టు రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రాకకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. కమిన్స్‌ తాజాగా ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాస్ అయ్యాడు. వెన్నునొప్పి గాయంతో గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉంటున్న కమిన్స్, త్వరలోనే జట్టుతో కలవనున్నాడు. వాస్తవానికి సీజన్ ప్రారంభానికి ముందే భారత్ చేరుకున్నాడు కమిన్స్, ఏప్రిల్ 2న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత విజయం స్కానింగ్ కోసం సిడ్నీకి వెళ్లాడు. అక్కడ నిర్వహించిన టెస్ట్‌ల్లో గాయం పూర్తిగా నయమైందని తేలింది. దీంతో పునరాగమనానికి లైన్ క్లియర్ అయ్యింది. 32 ఏళ్ల ఈ ఆసీస్ దిగ్గజం సోషల్ మీడియా ద్వారా తాను వెంటనే భారత్‌కు బయలుదేరుతున్నట్లు హింట్ ఇవ్వడంతో ఆరెంజ్ ఆర్మీలో కొత్త ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 25న జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరగబోయే మ్యాచ్‌లో కమిన్స్ బరిలోకి దిగే అవకాశం ఉంది.

READ MORE: Hyderabad: “నజీరాగా పేరు మార్చి కల్మా చదివించారు, బీఫ్ తినిపించారు”.. లవ్ జిహాద్ బాధితురాలి ఆవేదన..

ఈ ఏడాది కమిన్స్‌కు అంతగా కలిసిరాలేదనే చెప్పాలి. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్ తర్వాత అతను మళ్ళీ మైదానంలోకి దిగలేదు. దురదృష్టవశాత్తూ ఇటీవల ముగిసిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026కు కూడా అతను దూరం కావాల్సి వచ్చింది. ఆ టోర్నీలో ఆస్ట్రేలియా గ్రూప్ స్టేజ్ నుంచే నిష్క్రమించడం విశేషం. ఇక ఐపీఎల్‌లో కమిన్స్ అందుబాటులో లేని సమయంలో యువ ఆటగాడు ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో రెండింటిని గెలిపించిన ఇషాన్, పాయింట్ల పట్టికలో జట్టును నాలుగో స్థానంలో ఉంచాడు. ప్రస్తుతం సన్‌రైజర్స్ నెట్ రన్ రేట్ 0.576గా ఉంది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రాకకోసం ఎంతో మంది అభిమానుల కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూశారు. ఎట్టకేలకు రెగ్యూలర్ కెప్టెన్ ఎంట్రీతో ఎస్‌ఆర్‌ఎచ్‌లో ఊపు పెరగనుంది.

READ MORE: MLA Adimulam: ఎమ్మెల్యే ఆదిమూలం కుమారుడి సంచలన వ్యాఖ్యలు.. ఆ డబ్బులు ఇస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా..!