SRH: సన్ రైజర్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. 2027 ఐపీఎల్‌కు కాటేరమ్మ కొడుకు దూరం..

Ipl 2026 Srh Full Schedule

Ipl 2026 Srh Full Schedule

ఇండియన్ ప్రీమియర్ లీగ్ అభిమానులకు, ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి మరియు ఆ జట్టు మద్దతుదారులకు ఆందోళన కలిగించే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయవంతమైన కెప్టెన్, ఆస్ట్రేలియా స్టార్ కాంబో పేసర్ పాట్ కమిన్స్ ఐపీఎల్ 2027 సీజన్‌కు దూరం కానున్నట్లు స్వయంగా హింట్ ఇచ్చారు. రాబోయే కాలంలో అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ ఎంతో బిజీగా ఉన్న నేపథ్యంలో, తన వర్క్‌లోడ్‌ను సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి , ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి ఐపీఎల్ టోర్నమెంట్‌ను వదులుకోవాల్సి రావచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.

పాట్ కమిన్స్ ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు టెస్టులు మరియు వన్డే ఫార్మాట్లలో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు , ఆ దేశ ఆటగాళ్లకు అంతర్జాతీయ క్రికెట్, ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్లు.. సాంప్రదాయక టెస్ట్ సిరీస్‌ల పట్ల అత్యంత గౌరవం ఉంటుంది. ఈ క్రమంలోనే కమిన్స్ మాట్లాడుతూ.. “రాబోయే ఏడాది నా క్రికెట్ ప్రయాణంలో ఏదో ఒకదానిని ఖచ్చితంగా వదులుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే.. ఆస్ట్రేలియా తరఫున ఆడే ప్రతిష్టాత్మక టెస్టు మ్యాచ్‌లు మరియు వన్డే వరల్డ్ కప్ వంటి టోర్నీలను నేను ఎంతమాత్రం వదులుకోలేను. వీటికి నా కెరీర్‌లో ఎల్లప్పుడూ మొదటి ప్రాధాన్యత ఉంటుంది” అని స్పష్టం చేశారు.

×
×
Ad

షెడ్యూల్ ప్రకారం.. రాబోయే కాలంలో ఆస్ట్రేలియా జట్టు భారత్‌తో ప్రతిష్టాత్మకమైన సుదీర్ఘ టెస్టు సిరీస్‌ను ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ జనవరి నుంచి మార్చి వరకు జరగనుంది. భారత్‌తో జరిగే అన్ని టెస్టు మ్యాచ్‌ల్లోనూ తాను పూర్తిగా పాల్గొంటే, ఆ తర్వాత జూన్-జూలై నెలల్లో ఇంగ్లాండ్‌తో జరిగే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘యాషెస్ సిరీస్’ కోసం సిద్ధం కావాల్సి ఉంటుంది. ఈ రెండు భారీ టెస్ట్ సిరీస్‌ల మధ్యలో ఆటగాడిగా తనకు సరైన విశ్రాంతి ఎంతో అవసరమని కమిన్స్ పేర్కొన్నారు. భారత్ సిరీస్ ముగిసిన వెంటనే ఐపీఎల్ ప్రారంభమవుతుంది కాబట్టి, యాషెస్ సిరీస్‌కు ముందు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలంటే ఐపీఎల్ ఆడకుండా విశ్రాంతి తీసుకోవడమే సరైన మార్గమని ఆయన భావిస్తున్నారు.

అయితే.. ఐపీఎల్ 2027 సీజన్‌లో ఆడాలా వద్దా అనే విషయంపై సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంచైజీ యాజమాన్యంతో కూర్చొని సమగ్రంగా చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటానని కమిన్స్ వెల్లడించారు. గతంలో తనకు కొన్ని తీవ్రమైన గాయాలైన చరిత్ర ఉన్నందున, శరీరాన్ని మితిమీరి శ్రమకు గురిచేయడం ఇష్టం లేదని ఆయన అన్నారు. ప్రస్తుతానికి తన ముందున్న అంతర్జాతీయ లక్ష్యాలపైనే దృష్టి పెట్టానని, అందుకే ఇప్పుడే ఐపీఎల్ భవితవ్యంపై ఎలాంటి అధికారిక లేదా ఖచ్చితమైన ప్రకటన చేయాలనుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ కమిన్స్ ఈ టోర్నీకి దూరమైతే, అది ఎస్‌ఆర్‌హెచ్ జట్టుకు నాయకత్వ పరంగా, బౌలింగ్ పరంగా పెద్ద ఎదురుదెబ్బ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.