Pat Cummins: ఎస్ఆర్హెచ్ కెప్టెన్‌కు బీసీసీఐ బిగ్ షాక్.. ప్యాట్ కమిన్స్‌కు పీడకలగా మారిన అహ్మదాబాద్ మ్యాచ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pat Cummins: గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ ఓటమితో సతమతమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు మరో గట్టి షాక్ తగిలింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మంగళవారం జరిగిన ఈ పోరులో స్లో ఓవర్ రేట్ కారణంగా కమిన్స్‌కు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ రూ. 12 లక్షల జరిమానా విధించింది. ఈ సీజన్లో సన్‌రైజర్స్‌కు ఇది మొదటి తప్పిదం కావడంతో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఈ పెనాల్టీ పడింది. అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ మ్యాచ్ కేవలం 34.5 ఓవర్లలోనే ముగిసినప్పటికీ, నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయలేదన్న కారణంతో బీసీసీఐ ఈ చర్య తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఈ మ్యాచ్ ఫలితం విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 168 పరుగులు సాధించింది. కానీ, ఛేదనలో సన్‌రైజర్స్ బ్యాటర్లు గుజరాత్ పేసర్ల ధాటికి కేవలం 86 పరుగులకే కుప్పకూలారు. పిచ్‌పై ఉన్న అదనపు బౌన్స్‌ను ఉపయోగించుకుంటూ గుజరాత్ బౌలర్లు నిలకడగా హార్డ్ లెంగ్త్ బంతులతో విరుచుకుపడ్డారు. ఇక, తమ జట్టు ఓటమిపై స్పందించిన కమిన్స్.. ప్రత్యర్థి బౌలర్లు వేసినట్లుగా తాము సరైన లెంగ్త్‌లో ఎక్కువసేపు బౌలింగ్ చేయలేకపోయామని అంగీకరించాడు. “నిజం చెప్పాలంటే, ప్రత్యర్థి బౌలర్లు బ్యాక్ ఆఫ్ లెంగ్త్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశారు. మాకు స్కోరు చేసే అవకాశం ఇవ్వలేదు. మా బౌలింగ్ సమయంలోనూ అదే పద్ధతిని ఇంకాస్త ఎక్కువ సేపు కొనసాగించి ఉండాల్సిందేమో అనిపిస్తోంది. వాస్తవానికి ఈ పిచ్ బ్యాటింగ్‌కు చాలా కష్టంగా ఉంది. గుజరాత్ బౌలర్లు దాన్ని సంపూర్ణంగా వాడుకున్నారు. టీ20 క్రికెట్లో ఇంతకంటే అత్యుత్తమ బౌలింగ్‌ను చూడలేం” అంటూ కమిన్స్ ప్రత్యర్థి జట్టును ప్రశంసించాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
తాజావార్తలు
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!