Ruturaj Gaikwad: ముగిసిన సీఎస్కే ప్రయాణం.. ధోనీ రిటైర్మెంట్పై CSK కెప్టెన్ సంచలన ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ruturaj Gaikwad: గుజరాత్ టైటాన్స్‌తో గురువారం అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో 89 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకుంది. ఈ ఓటమితో రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలోని చెన్నై జట్టు 14 మ్యాచ్‌ల్లో కేవలం 12 పాయింట్లతోనే తన ప్రయాణాన్ని ముగించింది. అయితే, ఈ ఓటమి కంటే కూడా సీఎస్కే అభిమానులను తీవ్రంగా కలచివేసిన విషయం మరొకటి ఉంది. ఈ సీజన్లో ఎంఎస్ ధోనీని మళ్లీ సీఎస్కే జెర్సీలో చూడాలనే ఫ్యాన్స్ ఆశలు ఇక్కడితో ముగిసిపోయాయి.
ఈ సీజన్ అంతా ధోనీ గాయాల సమస్యలతోనే సతమతమయ్యాడు. మొదట పిక్క కండరాల నొప్పితో (కాఫ్ స్ట్రెయిన్), ఆ తర్వాత బొటనవేలి గాయంతో ఆటకు దూరమయ్యాడు. ఈ సీజన్ మొత్తంలో కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లో ధోనీ సీఎస్కే డ్రెస్సింగ్ రూమ్‌లో కనిపించాడు. ఆ తర్వాత జట్టు ఆడిన చివరి మ్యాచ్‌కు ముందే ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు. ప్రస్తుతం 44 ఏళ్ల వయసున్న ధోనీ, ఒక ఆటగాడిగా తన కెరీర్ చివరి దశకు చేరుకున్నప్పటికీ, ఆయనకున్న క్రేజ్, అరా మాత్రం రవ్వంతైనా తగ్గలేదు. వచ్చే ఐపీఎల్ నాటికి ధోనీ వయసు 45 ఏళ్లకు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు అందరి మదిలో మెదులుతున్న అత్యంత కీలకమైన ప్రశ్న ఎదురైంది: “వచ్చే ఏడాది మనం ఎంఎస్ ధోనీని మళ్లీ చూడబోతున్నామా?” అనే ప్రశ్నకు సీఎస్కే కెప్టెన్ స్పందిస్తూ.. “ఆ విషయం ఖచ్చితంగా వచ్చే ఏడాదే తెలుస్తుంది. నిజానికి నాకూ వచ్చే ఏడాదే తెలుస్తుంది. ఈ సీజన్లో మేము ధోనీని చాలా అంటే చాలా మిస్ అయ్యాము. ముఖ్యంగా ఇన్నింగ్స్ చివరి ఓవర్లలో ఆయన క్రీజులోకి వస్తే ప్రత్యర్థి జట్టులో ఉండే ఆ భయమే వేరు. కేవలం క్రీజులో అలా నిలబడినా చాలు.. మ్యాచ్ గమనాన్ని, మొమెంటమ్‌ను పూర్తిగా మార్చేయగల సత్తా ఆయనకుంది. అలాంటి వ్యక్తిని ఈ సీజన్లో మేము బాగా మిస్ అయ్యాం. అయితే వచ్చే సీజన్ గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేం. కానీ ఈ ఏడాది మా జట్టులోని ఆటగాళ్లు ఆడిన తీరు, వారికి లభించిన అనుభవం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను” అని రుతురాజ్ బదులిచ్చాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఇక, చెన్నై నగరానికి ధోనీ కేవలం ఒక ఆటగాడు మాత్రమే కాదు. ఆ ఫ్రాంచైజీకి ఆయనే ఒక బ్రాండ్, ఒక గుర్తింపు. దాదాపు రెండు దశాబ్దాలుగా కెప్టెన్‌గా, బెస్ట్ ఫినిషర్‌గా, జట్టును నడిపించే శక్తిగా క్రికెట్ నిర్వచనాలకు అతీతంగా ఎదిగిపోయాడు. ధోనీకి, చెన్నైకి మధ్య ఉన్న బంధం ఎప్పుడూ చాలా వ్యక్తిగతమైనదిగా, విడదీయరానిదిగా అనిపిస్తుంది. వయసు మళ్లుతున్నా, గాయాలవుతున్నా, కాలం మారుతున్నా ఆ ఎమోషనల్ బాండింగ్ మాత్రం అస్సలు తెగిపోలేదు. ధోనీ కూడా ఎన్నోసార్లు దీనిని గుర్తుచేస్తూ, సాధ్యమైనంత కాలం తాను సీఎస్కే కోసమే ఆడతానని చెప్తూ వచ్చాడు. గతంలో సరదాగా అన్న ఒక మాట ఈ బంధానికి అద్దం పడుతుంది: “నేను సీఎస్కే కోసం ఎంతకాలమైనా ఆడగలను, అది నా ఫ్రాంచైజీ. ఒకవేళ నేను వీల్‌చైర్‌కే పరిమితమైనా సరే, వాళ్లు నన్ను మైదానంలోకి లాక్కుని మరీ ఆడించుకుంటారు” అని ధోనీ నవ్వుతూ వ్యాఖ్యానించాడు. ఆ ఒక్క మాట చాలు.. ధోనీకి ఆ ఫ్రాంచైజీతో బంధం గురించి చెప్పడానికి!
తాజావార్తలు
-
ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్‌ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Sunrisers: బోణి కొట్టిన సన్ రైజర్స్.. ఎమ్ఐ లండన్‌పై ఘన విజయం..
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!