Mohsin Khan: “మెయిడెన్ ఓవర్.. ఆపై వికెట్”.. వైభవ్ జోరుకు బ్రేక్ వేసిన లక్నో పేసర్.. మునుపెన్నడూ జరగలే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohsin Khan: రాజస్థాన్ రాయల్స్‌కు దొరికిన సంచలన ఆటగాడు వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్‌లో అరంగేట్రంలోనే అద్భుత రికార్డులు సొంతం చేసుకున్నాడు. ఆరెంజ్ క్యాప్‌ను సైతం దిక్కించుకున్నాడు. ఇక ఈ 15 ఏళ్ల కుర్రాడిని ఆపడం ఎవరి తరం కాదని అందరూ అభిప్రాయపడ్డారు. కట్‌చేస్తే నిన్నటి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మొహ్సిన్ ఖాన్ చుక్కలు చూపించాడు. బుధవారం ఏకానా స్టేడియంలో జరిగిన పోరులో మొహ్సిన్ తన స్పెల్‌తో వైభవ్‌ను కట్టడి చేసేశాడు. ఈ సీజన్‌లో వైభవ్‌పై మెయిడెన్ ఓవర్ వేసిన తొలి బౌలర్‌గా మొహ్సిన్ రికార్డు సృష్టించాడు. కేవలం మెయిడెన్ వేయడమే కాకుండా ఆ ఓవర్ ఆఖరి బంతికి వైభవ్‌ను పెవిలియన్‌కు పంపి డబుల్ ధమాకా ఇచ్చాడు. నిజానికి ఈ ఐపీఎల్ సీజన్ మొత్తంలో ఇప్పటివరకు నమోదైన రెండు మెయిడెన్ ఓవర్లు మొహ్సిన్ ఖాతాలోనే ఉండటం విశేషం.
గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ నితీష్ రాణాను సైతం మొహ్సిన్ ఇలాగే పరుగులు చేయకుండా అడ్డుకున్నాడు. మొహ్సిన్ విసిరిన గుడ్ లెంగ్త్ డెలివరీని లాంగ్-ఆన్ మీదుగా బాదడానికి వైభవ్ ప్రయత్నించగా, బంతి బ్యాట్ లోపలి అంచుకు తగిలి గాల్లోకి లేచింది. కవర్స్ వద్ద ఉన్న దిగ్వేష్ రాఠీ వెనక్కి పరిగెత్తుతూ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో వైభవ్ ఇన్నింగ్స్ ముగిసింది. మరోవైపు మొహ్సిన్ ఖాన్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపిస్తున్నాడు. దీంతో లక్నోకు ఈ బౌలర్ వల్ల కలిసొచ్చే అంశం ఉంది. 2022లో అరంగేట్రం చేసినప్పుడు 9 మ్యాచ్‌ల్లో 14 వికెట్లతో చెలరేగిన మొహ్సిన్, ఆ తర్వాత గాయాల బారిన పడి తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. భుజం సర్జరీ, వెన్ను, కాలి గాయాల వల్ల గత సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. 2024లో పునరాగమనం చేసినా మునుపటి పదును కనిపించలేదు. కానీ, ఈ సీజన్‌లో వైభవ్ వంటి ఫామ్‌లో ఉన్న బ్యాటర్లను సైతం వణికించి తాను మళ్లీ ఫామ్‌లోకి వచ్చానని మొహ్సిన్ నిరూపించుకున్నాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!