Mahela Jayawardene: “హార్దిక్ ఒక్కడే బాధ్యుడు కాదు”.. ముంబై వరుస ఓటములపై కోచ్ సంచలన వ్యాఖ్యలు..

Mahela Jayawardene

Mahela Jayawardene

Mahela Jayawardene: ముంబై ఇండియన్స్(MI) ఒక్కసారిగా చెతికిల పడింది. ఈ సీజన్‌లో వరుసగా నాలుగు ఓటములు చవిచూసింది. ఈ అంశంపై తాజాగా ఆ జట్టు కోచ్ మహేల జయవర్ధనే మాట్లాడారు. పంజాబ్ కింగ్స్ (PBKS) చేతిలో ఘోర పరాజయం తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జయవర్ధనే జట్టు వైఫల్యాలపై స్పందించారు. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై వస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు. జట్టు పరాజయాలకు కేవలం ఒక్క వ్యక్తిని బాధ్యుడిని చేయడం సరికాదని, మేనేజ్‌మెంట్ నుంచి ఆటగాళ్ల వరకు అందరం సమిష్టిగా బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. “ఈ విఫల్యానికి కేవలం హార్దిక్ ఒక్కడే కారణం కాదు. మేమందరం బాధ్యులమే. జట్టు ప్రదర్శన సరిగ్గా లేనప్పుడు అది నా పైన, మేనేజ్‌మెంట్ పైనా ఉంటుంది. మెరుగైన ఫలితాల కోసం మేము ఎక్కడ తప్పు చేస్తున్నామో సమీక్షించుకోవాలి” అని జయవర్ధనే ధీమాగా చెప్పారు. ముంబై జట్టు నాణ్యమైన క్రికెట్ ఆడుతున్నప్పటికీ.. ప్రత్యర్థి జట్లు మరింత క్లినికల్‌గా ఉండి పైచేయి సాధిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రత్యర్థి జట్ల కాన్ఫిడెన్స్ లెవల్స్ ఎక్కువగా ఉండటం ముంబైకి ఇబ్బందిగా మారిందని, తాము నియంత్రించగలిగే అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.

READ MORE: Israel-Lebanon: ఇజ్రాయెల్‌తో 10 రోజులు కాల్పుల విరమణ ఒప్పందం.. లెబనాన్‌లో సంబరాలు

×
×
Ad

ఈ సీజన్‌ను విజయంతో ప్రారంభించినప్పటికీ, ఆ తర్వాత వరుస ఓటములతో ముంబై వెనకబడిపోయింది. కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందాలంటే వచ్చే మ్యాచ్‌ల్లో విజయాలు సాధించడం ఒక్కటే మార్గమని జయవర్ధనే పేర్కొన్నారు. ముఖ్యంగా రాబోయే విదేశీ మ్యాచ్‌లు జట్టుకు అత్యంత కీలకమని, అక్కడ గెలిచి మళ్ళీ రిథమ్‌లోకి రావాలని భావిస్తున్నట్లు తెలిపారు. పంజాబ్ మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. క్వింటన్ డికాక్ ఇచ్చిన అద్భుతమైన ఆరంభంతో తాము 210 నుంచి 220 పరుగులు చేస్తామని ఆశించినట్లు తెలిపారు. కానీ చివరి ఓవర్లలో తడబడటం వల్ల మొమెంటం కోల్పోయామని కోచ్ అంగీకరించారు. “చివరి దశలో మా బ్యాటర్లు రిథమ్ కోల్పోయారు, అలాగే బౌలింగ్‌లో మొదటి ఓవర్ నుండే పట్టు సాధించలేకపోయాము. దీనివల్ల మరో 20 పరుగులు తక్కువగా చేశాం. ఎగ్జిక్యూషన్ విషయంలో మేము చాలా బలహీనంగా ఉన్నాం, ఈ లోపాలను సరిదిద్దుకుని ముందుకు వెళ్తాం” అని జయవర్ధనే స్పష్టం చేశారు.