KL Rahul: ‘నన్ను టెస్ట్ ప్లేయర్ అన్నారు.. టీ20 ఆడటం రాదన్నారు’.. కేఎల్ రాహుల్ భావోద్వేగం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో క్లాసిక్ బ్యాటింగ్‌కు నిలువుటద్దం కేఎల్ రాహుల్. కర్ణాటకకు చెందిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్, తన కెరీర్ ఆరంభంలో సాంప్రదాయ టెస్ట్ క్రికెట్‌కు మాత్రమే పనికొస్తాడని విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ. పట్టుదలతో తన శైలిని మార్చుకుని మూడు ఫార్మాట్లలోనూ అత్యుత్తమ ఆటగాడిగా ఎదిగాడు. ముఖ్యంగా ఐపీఎల్ వంటి వేదికలపై భారీ స్కోర్లతో పాటు వేగంగా పరుగులు సాధిస్తూ విమర్శకుల నోళ్లు మూయించాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న రాహుల్, క్రీజులో ఉంటే ఆ ఫీల్డర్లకు పని చెప్పడం ఖాయం. మైదానంలో చురుకుగా ఉంటూ భారీ సిక్సర్లతో విరుచుకుపడటం అతని ప్రత్యేకత. గత పదేళ్ల ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన రాహుల్, ఇప్పుడు మరింత పరిణతి చెందిన ఆటగాడిగా కనిపిస్తున్నాడు.
అయితే తాజాగా ‘జియోస్టార్’ టాక్ షోలో పాల్గొన్న రాహుల్.. తన అంతరంగంలోని భావాలను పంచుకున్నాడు. తనపై ఉన్న “టెస్ట్ స్పెషలిస్ట్” అనే ముద్రను చెరిపివేసి, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నిరూపించుకోవడం పట్ల గర్వంగా ఉందని తెలిపాడు. టెస్ట్ క్రికెట్ కు మాత్రమే నువ్వు ఆడగలవు.. టీ20 క్రికెట్ కు పనికి రావు అని చాలా మంది అంటుంటే ఎంతో బాధపడ్డట్లు చెప్పుకొచ్చాడు. పదేళ్ల క్రితం టీ20 జట్టులో చోటు దక్కించుకోవడం తనకు కలగా ఉండేదని, కానీ నిరంతర శ్రమతో ఆ అడ్డంకులను అధిగమించానని చెప్పాడు. ఈ సీజన్ ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌పై 64 బంతుల్లోనే 152 పరుగులు చేసిన అద్భుత ఇన్నింగ్స్ గురించి ప్రస్తావిస్తూ.. ఫలితం అనుకూలంగా రాకపోయినా తన ఆటతీరుపై తనకు సంతృప్తి ఉందన్నాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
అంతేకాకుండా.. తండ్రిగా మారిన తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి రాహుల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. గతేడాది కుమార్తె పుట్టిన తర్వాత తన ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయిందని తెలిపాడు. “కుమార్తె కౌగిలింత, ఆమె చిరునవ్వు నా బాధలను మరిపిస్తాయి. తండ్రిగా మారడం నా క్రికెట్ పట్ల నా దృక్పథాన్ని మార్చింది. ఇప్పుడు నేను ఆటను అతిగా ఆలోచించడం లేదు. కేవలం ఆ 4-5 గంటలు మైదానంలో ఉత్సాహంగా ఆడుతున్నాను” అని చెప్పుకొచ్చాడు.
34 ఏళ్ల వయసులో ఉన్న రాహుల్, తనకింకా కెరీర్ మిగిలే ఉందని, రాబోయే రోజుల్లో దేశానికి, తన టీమ్‌కు మరిన్ని ట్రోఫీలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాడు. ఆటలో తప్పులు సహజమని, కానీ వాటి నుంచి నేర్చుకుని ముందడుగు వేయడమే అసలైన క్రీడా స్ఫూర్తి అని ఆయన వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో 185.84 సగటుతో 433 పరుగులు చేసి సెకండ్ లీడింగ్ స్కోరర్‌గా రాహుల్ కొనసాగుతున్నాడు.
తాజావార్తలు
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
-
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
-
Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
-
Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
-
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?