Jasprit Bumrah: ముంబై ఇండియన్స్(MI) ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వరుస ఓటములతో సతమతమవుతోంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఇందులో ఓ ప్రధాన కారణం వరల్డ్ అత్యుత్తమ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫామ్ కోల్పోవడం. బుమ్రా వికెట్లు పడగొట్టడంలో దిట్ట. కానీ.. ఈ సీజన్‌లో మాత్రం బుమ్రా పరిస్థితి గందరగోళంగా ఉంది. ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క వికెట్ కూడా తీయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ విషయంపై ముంబై ఇండియన్స్ కోచ్ మహేల జయవర్ధనే స్పందించారు. బుమ్రాను ఆయన వెనకేసుకొచ్చారు.
READ MORE: T20 World Cup 2026 Fixing: 2026 టీ20 ప్రపంచ కప్‌లో ఫిక్సింగ్.. ఐసీసీ దర్యాప్తు షురూ..!
బుమ్రా వికెట్లు తీయకపోవడానికి ప్రధాన కారణం ఇతర బౌలర్లు పవర్‌ప్లేలో ఒత్తిడి పెంచలేకపోవడమేనని జయవర్ధనే విశ్లేషించారు. దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్ వంటి పవర్‌ప్లే స్పెషలిస్టులు జట్టులో ఉన్నప్పటికీ, తొలి ఆరు ఓవర్లలో వికెట్లు పడకపోవడం ముంబైకి శాపంగా మారిందని చెప్పారు. “బుమ్రా బౌలింగ్ బాగానే ఆడుతున్నాడు. కానీ పవర్‌ప్లేలో మేము వికెట్లు తీయలేకపోవడం వల్ల ప్రత్యర్థి బ్యాటర్లు బుమ్రా ఓవర్లలో రిస్క్ తీసుకోవడం లేదు. వారు జాగ్రత్తగా ఆడుతూ వికెట్లు కోల్పోకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒక యూనిట్‌గా మేము విఫలమవుతున్నాము” అని జయవర్ధనే అభిప్రాయపడ్డారు.
READ MORE: VC Comments: పొట్టి దుస్తులు వల్లే అమ్మాయిలకు లైంగిక వేధింపులు.. వీసీ వ్యాఖ్యలపై విద్యార్థుల ఆందోళన
బుమ్రా మళ్ళీ తన పాత ఫామ్‌ను అందుకుంటాడనే నమ్మకాన్ని కోచ్ వ్యక్తం చేశారు. “ఒక్కసారి బుమ్రా వికెట్లు తీయడం మొదలుపెడితే, అతన్ని ఆపడం ఎవరితరం కాదు. అయితే జట్టులో ఇతర నాణ్యమైన బౌలర్లు కూడా తమ వంతు బాధ్యతను పంచుకోవాలి. గత కొన్ని మ్యాచ్‌ల్లో గాయాలు, అనారోగ్య సమస్యల వల్ల మా ప్రధాన ఆటగాళ్లందరూ అందుబాటులో లేరు. ఇప్పుడు వారంతా కోలుకుంటున్నారని, రాబోయే మ్యాచ్‌ల్లో సమిష్టిగా రాణిస్తామన్న నమ్మకం ఉంది” అని చెప్పుకొచ్చారు.
