IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్‌లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
- ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్
- అహ్మదాబాద్‌లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు
- గది అద్దెలు ప్రస్తుతం రూ.25,000 నుంచి రూ.36,000 వరకు పెరిగినట్లు సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో అహ్మదాబాద్ నగరం క్రికెట్ అభిమానులతో కిటకిటలాడుతోంది. ఆదివారం రాత్రి నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు తలపడనున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు దేశవ్యాప్తంగా వేలాది మంది అభిమానులు అహ్మదాబాద్‌కు తరలివస్తున్నారు. దీంతో విమాన టికెట్లు, హోటల్ గదుల ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం అహ్మదాబాద్‌కు వెళ్లే విమానాల టికెట్ ధరలు సాధారణ రేట్లతో పోలిస్తే గణనీయంగా పెరిగి, కొన్ని మార్గాల్లో రూ.17,000 నుంచి రూ.35,000 వరకు చేరుకున్నాయి.
హోటల్ గదుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఐపీఎల్ ఫైనల్ ప్రభావం హోటల్ రంగంపై స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా మే నెలాఖరు హోటల్ పరిశ్రమకు ఆఫ్-సీజన్‌గా పరిగణిస్తారు. అయితే ఫైనల్ మ్యాచ్ కారణంగా నగరంలోని అనేక ప్రముఖ హోటళ్లు ఇప్పటికే పూర్తిగా బుక్ అయ్యాయి. ముఖ్యంగా ఎస్జీ హైవే, మొతేరా, చంద్ఖేడా, గాంధీనగర్ ప్రాంతాల్లోని హోటళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. గతంలో రూ.8,000 నుంచి రూ.10,000 మధ్య ఉన్న గది అద్దెలు ప్రస్తుతం రూ.25,000 నుంచి రూ.36,000 వరకు పెరిగినట్లు సమాచారం.
రెండు రోజుల్లో రూ.200 కోట్ల ఆదాయం?
అహ్మదాబాద్‌లో ప్రస్తుతం సుమారు 20,000 హోటల్ గదులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఐపీఎల్ ఫైనల్ కారణంగా దాదాపు అన్ని గదులు బుక్ అయ్యే అవకాశం ఉందని హోటల్ రంగం అంచనా వేస్తోంది. నగరంలో సుమారు 200 త్రీ-స్టార్, ఫైవ్-స్టార్ హోటళ్లు ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్ కారణంగా కేవలం రెండు రోజుల్లోనే హోటల్ పరిశ్రమకు రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని రంగ నిపుణులు చెబుతున్నారు.
పర్యాటక రంగానికి భారీ ఊతం
ఐపీఎల్ ఫైనల్ కేవలం హోటల్ రంగానికే కాకుండా పర్యాటక, రవాణా, రెస్టారెంట్ రంగాలకు కూడా పెద్ద ఎత్తున లాభాలు తెచ్చిపెడుతోంది. విమానాలతో పాటు రైలు, బస్సు టికెట్లకు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం వేసవి సెలవులు కొనసాగుతుండటంతో యువత, కుటుంబాలు పెద్ద సంఖ్యలో అహ్మదాబాద్‌కు చేరుకుంటున్నారు. దీంతో నగరంలోని వ్యాపార కార్యకలాపాలు కూడా ఊపందుకున్నాయి.
అహ్మదాబాద్‌కు ఆర్థిక బూస్టర్‌గా ఐపీఎల్ ఫైనల్
హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ప్రతినిధుల ప్రకారం, నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహించే భారీ క్రీడా ఈవెంట్లు నగర ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్షంగా మేలు చేస్తున్నాయి. గతంలో ప్రపంచకప్ మ్యాచ్‌లు, అంతర్జాతీయ ఈవెంట్లు, సంగీత కచేరీలు కూడా నగరానికి భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ఐపీఎల్ ఫైనల్ కూడా అదే స్థాయిలో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిస్తోందని వారు పేర్కొన్నారు.
వేలాది మందికి తాత్కాలిక ఉపాధి
ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాబ్ సేవలు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు, భద్రతా సిబ్బంది తదితర రంగాల్లో వేలాది మందికి తాత్కాలిక ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. క్రీడా ఈవెంట్లు నగర ఆర్థికాభివృద్ధికి ఎంతగా దోహదపడతాయో ఐపీఎల్ ఫైనల్ మరోసారి నిరూపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..