RCB Vs GT: ఆకాశమే హద్దుగా చెలరేగిన కోహ్లీ.. మరో రికార్డు బద్దలు కొట్టిన విరాట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తన వింటేజ్ ఫామ్‌ను ప్రదర్శిస్తూ ప్రత్యర్థి బౌలర్ కగిసో రబడ వేసిన ఒకే ఓవర్లో ఐదు ఫోర్లు బాది స్టేడియంను హోరెత్తించాడు.
ఒకే ఓవర్లో 5 ఫోర్లు..
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
RCB తరపున ఒకే ఓవర్లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ ఫోర్లు కొట్టిన దిగ్గజాల సరసన కోహ్లీ ఇప్పుడు నిలిచాడు. గతంలో ఈ ఘనత సాధించిన వారిలో.. క్రిస్ గేల్ ఉన్నారు. ఇతడు 2013లో పుణే వారియర్స్ ఇండియాపై.. బౌలర్ ఈశ్వర్ పాండే బౌలింగ్ లో కొట్టాడు. షేన్ వాట్సన్.. 2016లో రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్ పై.. తిసార పెరీరా బౌలింగ్ లో కొట్టాడు. ప్రస్తుతం ఆ జాబితాలో విరాట్ కోహ్లీ నిలిచాడు.
తొలి 10 బంతుల్లోనే విధ్వంసం
ఈ మ్యాచ్‌లో కోహ్లీ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. తన టీ20 కెరీర్‌లోనే ఇన్నింగ్స్ ప్రారంభించిన మొదటి 10 బంతుల్లోనే అత్యధికంగా 28 పరుగులు రాబట్టాడు. గతంలో 2025లో బెంగళూరు వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పై కూడా అతను సరిగ్గా 10 బంతుల్లో 28 పరుగులు చేశాడు. నేటి మ్యాచ్‌లో 13 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో మొత్తం 28 పరుగులు చేసి రబడ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు.
ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో కోహ్లీ తన దూకుడును మరోసారి ప్రపంచానికి చాటిచెప్పాడు. పరుగుల యంత్రం మళ్ళీ పాత వేగాన్ని పుంజుకోవడంతో ఆర్‌సీబీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
-
Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
-
Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
-
Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
-
Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!